డ్రగ్స్ కేసులో కొత్త నిజాలు
హైద్రాబాద్, జూన్ 5
హైదరాబాద్‌లో పట్టు బడ్డ డ్రగ్స్ ముఠా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ వద్ద నుంచి డ్రగ్స్ తీసుకున్న మూడు వందల మంది పై నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు. లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న మూడువందలమందిలో సినీ ప్రముఖులతో పాటుగా వ్యాపారవేత్తలు, విద్యార్థులు పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ విక్రయాలు జరిపిన వారి కదలికలపై నిఘా పెట్టారు అధికారులు. 15 రోజులుగా నగరంలో డ్రగ్స్ కొనుగోలు ,అమ్మకాలు పెరిగినట్లుగా గుర్తించారు. మరికొందరు ప్రముఖులు బెంగుళూరుకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు.డ్రగ్స్ తీసుకున్న మూడు వందల మంది ఎవరు.. ఇప్పుడు సంచలనంగా మారింది . అయితే గత కొంత కాలం నుంచి తీసుకున్న 300 మంది తిరిగి డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్సిజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతున్నారు . 2 రోజుల క్రితం డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అమిత్ ,పరమ అనే ఇద్దరి అరెస్టుతో ప్రముఖుల చిట్టా బయటపడుతుంది. అయితే పట్టుబడ్డ నిందితులు వాట్సాప్ చాటింగ్ తోపాటు కాల్ డాటాను డిలీట్ చేశారు. వీళ్ల అరెస్ట్ చేసినప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయిని అధికారులు చెబుతున్నారు.సాంకేతిక పరంగా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీళ్ళు కొన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా వాట్సాప్, టెలిగ్రామ్ లో చేసిన చాటింగ్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చేశారు. దీంతోపాటుగా కాల్ లిస్ట్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు . అధికారులు పట్టుకుని వెంటనే ఫోన్ ని సీజ్ చేశారు. దాంట్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ లో చాటింగ్ ను చూసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే చాటింగ్ మొత్తం కూడా డిలీట్ కావడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో టెక్నికల్ సపోర్టింగ్ కోసం పోలీసు అధికారులను ఆశ్రయించారు.వాట్సాప్ టెలిగ్రామ్ తో పాటు పూర్తిగా చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి కొంత సమయం పడుతుందని పోలీస్ అధికారులకు వెల్లడించారు. అయితే ఏది ఏమైనప్పటికీ 300 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అధికారులు వద్ద చేరింది. ప్రధానంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపార వేత్తలు విద్యార్థులు ఈ మేరకు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొంత సమాచారం . దీనికి సంబధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో అధికారులు పడ్డారు. మంగళవారం పోలీసులు భారీగా డ్రగ్స్ చెలామణిని గుర్తించారు. ఫేస్ మాస్క్‌ల పేరుతో ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయాల దందా జోరుగా సాగుతున్నట్లుగా తేల్చారు. మంగళవారం ముగ్గురి దగ్గర నుంచి 54 గ్రాముల కొకైన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.