చంద్ర గ్రహణం జూన్ 2020 :
జ్యేష్ఠ పౌర్ణమి అయిన జూన్ 5వ తేదీన వస్తుంది.
గ్రహాల అనుగ్రహం.. వాటి స్థితిగతుల ఆధారంగా గడిచిన కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తును అంచనా వేస్తారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. అయితే గ్రహణాల రోజున వీటి ప్రభావం మానవులపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా జూన్ నెల అస్థిరంగా ఉండి దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. దీంతో ఈ చంద్ర గ్రహణం చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది.
ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..
జూన్ 5న గ్రహణం సుమారు అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతుంది. అలా మొదలైన గ్రహణం జూన్ 6వ తేదీన తెల్లవారుజామున 2:34 గంటలకు ముగుస్తుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం..
ఈ చంద్ర గ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉండే వారు చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా చంద్రుడి ఆకారంలో ఎలాంటి మార్పులు సంభవించవు. అయితే చంద్రుడిలో కొంత కాంతి తక్కువగా అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే జనవరి నెల 10వ తేదీన తొలి చంద్రగ్రహణం కూడా పూర్తయ్యింది.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో