YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో రాత్రికి రాత్రి రంగులు మారుతున్నాయ్...

బెజవాడలో రాత్రికి రాత్రి రంగులు మారుతున్నాయ్...

బెజవాడలో రాత్రికి రాత్రి రంగులు మారుతున్నాయ్...
విజయవాడ, జనవరి 5,
“ఏపీలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం హైకోర్టు, సుప్రీం కోర్టుల అభ్యంతరాల నేపథ్యంలో రాజకీయ విమర్శలు జోరుగా సాగుతుంటే ఐదేళ్ల కిందటి సంగతి గుర్తొచ్చింది. 2015 ద్వితియార్ధమో., 2016 మొదట్లోనో అనుకుంటా విజయవాడలో డివైడర్ల రంగులు రాత్రికి రాత్రి మారిపోయాయి. కొద్ది రోజుల ముందే డివైడర్లకు ఉండే జీబ్రా గీతల స్థానంలో వేరే రంగులు ప్రత్యక్షమయ్యాయి. దీనిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఓ సీనియర్‌ అధికారి తన బాస్‌ను మెప్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని అమలు చేశారని అప్పట్లో చెప్పుకున్నారు. పత్రికల్లో కూడా ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఎలాంటి చర్చ జరగలేదు. ఏ వివాదం పుట్టలేదు. కోర్టు కేసులు కాలేదు. ఐదేళ్ల తర్వాత గీతల మీద ఆ రంగులు మారి… మళ్లీ కంచరగాడిదలకు వాటి పాత రంగొచ్చింది. ఆ రంగులు శాశ్వతం అనే గ్యారంటీ అనేమి లేదు. ఎవరి దురదకు వారి పేటెంట్ రంగుంటుంది.”పార్టీ విప్ ధిక్కరించిన ఆరోపణల మీద ఎమ్మెల్సీలపై అనర్హత ప్రకటించాలనే ఫిర్యాదుతో కొంతమంది ఎమ్మెల్సీలు బుధవారం సాయంత్రం అసెంబ్లీకి వెళ్లారు. తమ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ దగ్గర పట్టుబట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ మిత్రుడు గతంలో మీరు కూడా ఇలాగే వేరే పార్టీ వాళ్లను చేర్చుకున్నారు కదా., అప్పుడు అది తప్పు కాదా అని అడిగితే? ఫిర్యాదు చేయడానికి వచ్చినాయన అంతెత్తున లేచాడు. 23మంది పార్టీ మారితే ఆ పార్టీ వాళ్లు పోరాటం చేయాలి., వాళ్లకు పోరాడటం చేతకాలేదు., మాకు గట్టిగా పోరాడటం వచ్చు., ఆ రోజు వాళ్లు హైకోర్టు., సుప్రీం కోర్టులకు ఎందుకు వెళ్లలేదు., అసలు వాళ్లు పోరాటం చేయడంలోనే ఫెయిల్‌ అయ్యారని, వాళ్ల చేతకానితనంతో ఊరుకున్నారని రిప్లై ఇచ్చాడు.”అనర్హత వేటు వేయాలని అడుగుతున్న ఇద్దరిలో….. “ఒకాయన తాను గవర్నర్ కోటాలో వచ్చానంటున్నారని., తనకు విప్ వర్తించదంటున్నారంటే…..! “గవర్నర్‌ కోటాలో వచ్చినా తమ అధినేత సిఫార్సు లేఖతోనే కదా గవర్నర్‌ కోటాలో వచ్చింది., అతనేమైనా స్వాతంత్ర్య సమరయోధుడా., పెద్దపెద్ద త్యాగాలు చేసిన గొప్పోడా మా నాయకుడి దయతోనే కదా ఎమ్మెల్సీ అయ్యింది. ఆ పదవి పోవాల్సిందే అన్నాడు. పోరాడాల్సిన సమస్యలు., రొచ్చు గుంటలో పిత్తపరిగలు ఏరడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంటుంది.?

Related Posts