కరోనాతో ఫ్యామిలీస్ కు దూరం
హైద్రాబాద్, జూన్ 5,
కరోనా ఎఫెక్ట్తో పోలీసులు ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులను సొంతూళ్లకు పంపిస్తున్నారు. కొందరు కానిస్టేబుల్స్ స్టేషన్లనే షెల్టర్‌గా చేసుకుని డ్యూటీ చేస్తున్నారు. వెస్ట్, సౌత్ జోన్స్పరిధిలో 40 శాతం మంది పోలీసులు ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గ్రేటర్ లోని 3 కమిషనరేట్లలోని స్టేషన్లకు చెందిన ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్)ను సీపీలకు అందిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం, తలనొప్పి, జలుబు ఉంటే వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. డ్యూటీకి వస్తున్న సిబ్బంది ఉండే ఏరియాలు, అక్కడ కరోనా తీవ్రతను రికార్డ్ చేస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని కాంటాక్ట్స్ సిబ్బందిపై దృష్టి పెట్టారు. క్రైమ్ కేసుల ఇన్వెస్టిగేషన్‌లో పాటించాల్సిన హెల్త్ గైడ్ లైన్స్ ను ఉన్నతాధికారులు రూపొందించారు. క్రైం సీన్ విజిట్ టైమ్లో మాస్క్, ఫేస్ షీల్డ్ మాస్క్, శానిటైజర్ మస్ట్ చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌లోని పరిసరాలను టచ్ చేయకుండా క్లూస్ కలెక్ట్ చేయాలని సూచించారు. నిందితులను దూరంగా నిలబెట్టి మాట్లాడాలని, అదుపులోకి తీసుకుని తరలించేప్పుడు ఫిజికల్డిస్టెన్స్ పాటించాలని పేర్కొన్నారు. హాస్పిటల్కు తీసుకెళ్లేప్పుడు పీపీఈ కిట్, మాస్క్ వాడాలని స్పష్టం చేశారు.