YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 పరీక్షలొద్దు... సోషల్ మీడియాలో ఉద్యమం

 పరీక్షలొద్దు... సోషల్ మీడియాలో ఉద్యమం

 పరీక్షలొద్దు... సోషల్ మీడియాలో ఉద్యమం
హైద్రాబాద్, జూన్ 5, 
కర్ణాటక విద్యార్థులను అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్ చేయాలంటూ 'ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్స్' హ్యాష్ ట్యాగ్ తో తమకు ఎగ్జామ్స్ వద్దని డిమాండ్ చేస్తున్నారు.కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న కర్ణాటక విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి తమకు కూడా పరీక్షలొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా అనుసరిస్తూ తమకూ పరీక్షలు వద్దంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను చేస్తున్న సమయంలో, ఆ ఏర్పాట్లు తమలో ధైర్యాన్ని పెంచడం లేదన్నది విద్యార్థుల అభిప్రాయం. తమకు వైరస్ సోకవచ్చన్న భయాందోళనలతో ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేమని అంటున్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకూ స్పందించ లేదు. పదోతరగతి విద్యార్ధినీ, విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలపై పునరాలోచించాలి. ఏపీ తెలంగాణల్లో 10 లక్షలమందికి పైగా పిల్లలు పరీక్షలు రాయాలి. కరోనా కారణంగా పిల్లలు, లక్షలమంది  తల్లిదండ్రులు,ఇన్విజిలేటర్లు రోడ్లమీదకు వస్తారు పరీక్షలు వద్దంటూ ఓ పేరెంట్ ట్వీట్ చేశారు

Related Posts