YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

మీటింగ్స్ కు  చిరంజీవి దూరం..?

మీటింగ్స్ కు  చిరంజీవి దూరం..?

మీటింగ్స్ కు  చిరంజీవి దూరం..?
హైద్రాబాద్, జూన్ 5,
గత కొన్ని రోజులుగా బాలకృష్ణ- చిరంజీవి ఇష్యూ తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి, ఇతర సినీ పెద్దలంతా కలిసి తెలంగాణ ప్రభుత్వంలో జరిపిన చర్చలకు తనను పిలవలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ.. అంతటితో ఆగక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ విషయమై ఆ ఐదు కోట్లు ఏమయ్యాయి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ మాటలకు నొచ్చుకున్న చిరంజీవి ఓ డిసీజన్‌కి వచ్చారని తెలుస్తోంది.కరోనా కష్టకాలంలో సీసీసీ (కరోనా క్రైసిస్ కమిటీ) ఏర్పాటు చేసి చిత్ర వర్గాల సహకారంతో సినీ కార్మికులకు అండగా నిలిచిన చిరంజీవి.. ఆ తర్వాత షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సహా పలువురు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. అయితే ఉన్నట్టుండి సడెన్‌గా తనను ఆ మీటింగ్‌కి పిలవలేదంటూ బ్లాస్ట్ అయిన బాలకృష్ణ, వాళ్లంతా కలిసి భూములు పంచుకుంటున్నారా? అని కామెంట్ చేయడం వివాదానికి తెరలేపింది. ఆ వెంటనే ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీకి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ మరో ఇష్యూని లేవనెత్తడంతో దీనిపై చర్చలు ముదిరాయి.దీంతో తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలు చూసి చిరంజీవి బాగా నొచ్చుకున్నారని ఇన్‌సైడ్ టాక్. కరోనాని కూడా లెక్కచేయకుండా పెద్దలని కలుస్తుంటే ఇటువంటి నిందలు తనపై వస్తున్నందుకు ఆయన హర్ట్ అయ్యారని.. ఈ క్రమంలోనే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి ప్రభుత్వం జరిపే చర్చలకు తాను హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తన సినిమా 'ఆచార్య' షూటింగ్ విషయంలో కూడా తొందరపడకుండా సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు సమాచారం. చిరంజీవి ఇలాంటి నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుండటం మరిన్ని చర్చలకు ఊతమిస్తోంది. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎలా సద్దుమణుగుతుందో!.

Related Posts