కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తా... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జూన్ 5
ప్రభుత్వం ఏదైతే రైతులను సన్న రకాల బియ్యం వేయమంటుందో దానికి రైతులకు 2500 రూ.ల మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి తెల్లరేషన్ కార్డు ఉన్న 3 కోట్ల నిరుపేదలకు పంపిణీ చేయాలి అలా చేస్తే నేను కూడా కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే ఇటు రైతులకు అటు వినియోగదారుల కు మేలుచేసిన వాళ్ళం అవుతాము. అప్పుడే దేశం గర్వించదగ్గ పని అవుతుంది అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తులకు, విత్తన రాయితీ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. గ్రేడ్ 1 వరి ధాన్యానికి 1830 మద్దతు ఉంది దీనికి 10 శాతం పెంచితేనే గిట్టుబాటు అవుతుంది కానీ కేవలం 3 శాతం మాత్రమే పెంచారు. నియంత్రణ సాగు విధానం అనేది నిర్బంధ సాగుల ఉంది. ఈ విధానం ప్రపంచంలో నే ఎక్కడ లేదు. గత రెండు ఆర్థిక సంవత్సరాలు పండ్ల తోటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదు. రాష్ట్రంఎంతోనిర్లక్ష్యంగావ్యవహరిస్తోంది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత. సన్నరకాలు అనే నెపంతో రైస్ మిల్లర్ల కు తాకట్టు పెట్టాలని చూస్తుందని అయన అన్నారు.