YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

24 గంట‌ల్లో దేశంలో 9851 క‌రోనా పాజిటివ్ కేసులు

24 గంట‌ల్లో దేశంలో 9851 క‌రోనా పాజిటివ్ కేసులు

 24 గంట‌ల్లో దేశంలో 9851 క‌రోనా పాజిటివ్ కేసులు
హైద‌రాబాద్‌ జూన్ 5 
ఇండియాలో వ‌రుస‌గా రెండ‌వ రోజు కూడా క‌రోనా పాజిటివ్ కేసులు 9వేలు దాటాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో 9851 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వైర‌స్ వ‌ల్ల 24 గంట‌ల్లో 273 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,770కి చేరుకున్న‌ది.  దీంట్లో మొత్తం 1,10,960 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో ల‌క్ష మందికిపైగా వైర‌స్ నుంచి కోలుకున్నారు.  దేశంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 6348కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. ఐసీఎంఆర్ కూడా త‌న టెస్టింగ్ సంఖ్య‌ను రిలీజ్ చేసింది. ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 43,86,376 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.  అయితే గత 24 గంట‌ల్లో 1,43,661 మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ ఇవాళ వెల్ల‌డించింది.  ఇవాళ దేశంలో న‌మోదు అయిన‌ పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే అత్య‌ధికంగా. భార‌త్‌లో వైర‌స్ రిక‌వ‌రీ రేటు 48.27 శాతంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు.  వైర‌స్ బారిన ప‌డ్డ దేశాల్లో  భార‌త్ ఏడ‌వ స్థానంలో ఉన్న‌ది.  కోవిడ్‌19 వ‌ల్ల అమెరికా, బ్రెజిల్‌, ర‌ష్యా, బ్రిట‌న్‌, స్పెయిన్‌, ఇట‌లీ దేశాల్లో మ‌ర‌ణాలు అత్య‌ధిక స్థాయిలో ఉన్నాయి.

Related Posts