YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా మృతుడి చితాభస్యం ఇవ్వండి

కరోనా మృతుడి చితాభస్యం ఇవ్వండి

 కరోనా మృతుడి చితాభస్యం ఇవ్వండి
హైదరాబాద్ జూన్ 5 
మధుసూదన్ కరోనాతో చనిపోయాడని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ప్రభుత్వం హైకోర్టుకు తెలపగా.. అయితే, అతని డెత్ సర్టిఫికెట్, చితాభస్మం వారికి అప్పగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో కరోనాతో తన భర్త మధుసూధన్ చనిపోతే తనకు సమాచారం ఎందుకివ్వలేదని ఆయన భార్య మాధవి మరోసారి ప్రశ్నించింది. ఆయన చనిపోయి చాలా రోజులు కాగా వైద్యులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణం సంగతి తనకు ఎవరూ చెప్పనేలేదని వాపోయారు. ఆ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయాడని అనేందుకు ఆధారాలు చూపించాలని మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, మధుసూదన్ కరోనాతో మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ హైకోర్టుకు తెలిపింది. వనస్థలిపురం మధుసూదన్ మృతిపై అతని భార్య మాధవి హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తన భర్త ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించిన విషయాలు చెప్పమని మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. మధుసూదన్ కరోనాతో చనిపోయాడని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, అతని డెత్ సర్టిఫికెట్, చితాభస్మం మధుసూదన్ భార్యకు అప్పగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

Related Posts