YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఎస్బీఐ నికర లాభం పెరిగింది

ఎస్బీఐ నికర లాభం పెరిగింది

ఎస్బీఐ నికర లాభం పెరిగింది
ముంబయి జూన్ 5
స్టేట్ బ్యాంక్ తాజాగా క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఇందులో బ్యాంక్  నికర లాభం భారీగా పెరిగింది. దాదాపు 4 రెట్లు పైకి కదలింది. అలాగే మొండి బకాయిలు కూడా తగ్గాయి. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గింది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదరగొట్టింది. బ్యాంక్ తాజాగా క్యూ4 (2019-20, జనవరి-మార్చి త్రైమాసికం) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం రూ.3,581 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్ లాభం ఏకంగా 4 రెట్లు పెరిగింది. తక్కువ కేటాయింపులు, వాటా అమ్మకం ఇందుకు ప్రధాన కారణం. స్టేట్ బ్యాంక్ నికర లాభం 4 రెట్లు పెరిగినా కూడా మార్కెట్ అంచనాల కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డులో వాటా విక్రయించింది. దీని ద్వారా బ్యాంక్కు రూ.2,731 కోట్లు లభించాయి. నికర లాభంలో ఇది కూడా భాగంగానే ఉంది.  ఇక బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం మాత్రం 0.8 శాతం క్షీణతతో వార్షిక ప్రాతిపదికన రూ.22,766 కోట్లకు తగ్గింది. రుణ వృద్ధిలో వార్షిక పెరుగుల స్వల్పంగా (6.4 శాతం) నమోదు కావడం ఇందుకు కారణం. మార్కెట్ వర్గాలు బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.25,905 కోట్లుగా అంచనా వేశారు. ఇక నికర లాభాన్ని రూ.5714 కోట్లుగా లెక్కించారు. ఇక తాజా సమీక్ష త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. త్రైమాసికం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 2.23 శాతానికి తగ్గాయి. ఇక నికర ఎన్పీఏలు 6.15 శాతానికి క్షీణించాయి. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎస్బీఐ షేరు 8 శాతం మేర ర్యాలీ చేసింది. అయితే వార్షిక ప్రాతిపదికన ఎస్బీఐ షేరు 50 శాతం పడిపోయింది. బ్యాంక్ చైర్మన్ రజ్నీష్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ బలంగా ఉందని, భవిష్యత్లో ఎలాంటి సమ్యను అయిన ఎదుర్కోగల సత్తా ఉదని పేర్కొన్నారు

Related Posts