YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు వాళ్లను వదిలేశారా..

 చంద్రబాబు వాళ్లను వదిలేశారా..

 చంద్రబాబు వాళ్లను వదిలేశారా..
విజయవాడ, జూన్ 6 
అదేమి ఖర్మో కానీ చంద్రబాబు అందరి వద్దా అదే పేరు తెచ్చుకుంటున్నారులా ఉంది. ఆయనకు వెన్నుపోటు బిరుదు పాతికేళ్ళు అయినా మరింతగా సార్ధకం అవుతోంది కానీ ఎక్కడా జనం మరచిపోకుండా అంతా కలసి చేస్తున్నారు. ఓ వైపు రాజకీయ ప్రత్యర్ధులు చంద్రబాబుని వెన్నుపోటు వీరుడు అంటూ చెడుగుడు ఆడుకుంటూంటే ఆయన్ని నమ్ముకున్న వారు సైతం ఇదే మాట గుర్తుకుతెచ్చుకుని వాపోతున్నారుట. ఇంతకీ చంద్రబాబు తాజాగా ఎవరిని వెన్నుపోటు పొడిచారు అంటే రాజధాని రైతులనే అని చెప్పాలని అంటున్నారు. రాజధాని రైతుల విషయంలో బాబు పెట్టాల్సిన చిచ్చు పెట్టేసి ఇపుడు చేతులెత్తేశారని ఆవేదన చెందుతున్నారు.నాడు జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే తన రాజకీయం కోసం చంద్రబాబు రైతులను రెచ్చగొట్టారని ఇపుడు తాపీగా గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నారు. అప్పట్లో అమరావతి రాజధాని రైతుల సమస్యలు చెప్పుకోవడానికి జగన్ సర్కార్ మంత్రులతో కమిటీ వేసిందని, అయినా అక్కడకి వెళ్లకుండా టీడీపీ పెద్దలు స్వార్ధ రాజకీయం చేస్తూ తాము రాజధానిని ఎక్కడికీ పోనీయమని ప్రగల్బాలు పలికారని అంటున్నారు. తీరా జగన్ సర్కార్ మరింత బిగుసుకుని తలుపులు మూసేయడమే కాదు, విశాఖ వైపుగా దూకుడుగా పరుగులు తీస్తోందని, తమపైన టీడీపీ ముద్ర వేయించి తమ్ముళ్ళతో పాటు చంద్రబాబు కూడా ఎటూ కాకుండా చేశారని రాజధాని రైతులు అంటున్నారు.ఇక చంద్రబాబు అమరావతి రైతుల ఉద్యమం 150 రోజులు అయిందని హైదరాబాద్ లో కూర్చుని ఈ మధ్యనే ట్వీటారని, తీరా ఏపీకి వచ్చి మూడు రోజుల పాటు ఉండవల్లి కరకట్ట మీద మహానాడు పేరిట ‌కాలక్షేపం చేసినా కూడా రైతులను పరామర్శించాలన్న ఆలోచన లేకుండా పోయిందని వారు మండిపోతున్నారుట. లాక్ డౌన్ లో ఎలా ఉన్నారని కనీసం ఆరా తీయకుండా చంద్రబాబు అటునుంచి అటే హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారని అంటున్నారు. ఓ విధంగా అమరావతి రాజధాని కాదని ముందే తెలిసినట్లుగా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే నెలల తరబడి ఉంటున్నారని రైతులు అంటున్నారుట. బాబు ఇన్నాళ్ళూ కరకట్ట మీద ఉంటే ఏదైనా కొంత ఆశ ఉండేదని, ఇపుడు ఆయన సైతం వదిలేసి పోవడంతో ఇక అమరావతి గతి ఏం కానూ అని రైతులు దిగాలు పడుతున్నారుట.ఇంకోవైపు చూసుకుంటే జగన్ విశాఖ వైపు చూస్తున్నారని, జరగాల్సిన పనులు చకచకా చేస్తూ అన్నీ చక్కబెట్టేస్తున్నారని అంటున్నారు. ఈ మధ్య ఆయన పారిశ్రామికవేతాలతో మాట్లాడుతూ విశాఖ రాజధాని అవుతుందని మరోసారి గట్టిగా చెప్పేశారని గుర్తుచేస్తున్నారు. అలాగే ఆయన సన్నిహితుడు విజయసాయిరెడ్డి విశాఖ రాజధాని రావడం ఖాయమని ప్రతీ రోజూ చెబుతున్నారని, ఇంకో వైపు ముహూర్తాలు కూడా పెట్టుకుని అమరావతి నుంచి చలో విశాఖ అనేందుకు వైసీపీ సిధ్ధంగా ఉందని రైతులు గోడుమంటున్నారు. చంద్రబాబు మొదట రెచ్చగొట్టి ఇపుడు తనకు ఎంతో ఇష్టమైన మరో రాజధాని హైదరాబాద్ లో హాయిగా కాపురం ఉంటూ అమరావతి రైతులను నిండా ముంచారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కరోనా మహమ్మరి ఇంకా పోటెత్తుతున్న నేపధ్యంలో ఇక మీదట చంద్రబాబు ఉండవల్లి రావడం అక్కడే పూర్తిగా ఉండడం ఎటూ సాధ్యపడదని, అమరావతి రాజధాని ఆశలన్నీ ఆవిరేనా అని రైతులు బోరుమంటున్నారుట.

Related Posts