YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కే ఎందుకిలా...

జగన్ కే ఎందుకిలా...

జగన్ కే ఎందుకిలా...
విజయవాడ, జూన్ 6,
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇపుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిన్నటిదాకా చక్రం తిప్పారు, ఇపుడు జేపీ నడ్డాను ఆ సీట్లో కూర్చోబెట్టినా కూడా అమిత్ షా ముద్ర, పట్టు పార్టీ మీద ఎక్కడికీ పోలేదు. ఇక ప్రభుత్వంలో కూడా మోడీ తరువాత షానేఅంటారు. కానీ మోడీకి మించి అని చెబుతారు దగ్గరుండి చూసిన వారు. మోడీ అమిత్ షా మీద బాగా ఆధారపడుతున్నారు. దాంతో షా తన రాజకీయ మంత్రాంగాన్నిమెల్లగా బయటకు తీస్తున్నారని చెబుతున్నారు. . మోడీ వరమిచ్చినా అమిత్ షా ప్రసాదం పెట్టడని అందుకే అంటారు.వరసగా రెండవసారి జగన్ కి అమిత్ షా చేతిలో అవమానం జరిగిందని చెప్పాలి. ఆ మధ్య జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు ఇలాగే ఒక రోజంతా కూర్చోబెట్టి ఖాళీ లేదు, బిజీ షెడ్యూల్ అని చెప్పి అమిత్ షా జగన్ కి అపాయింటుమెంట్ ఇవ్వలేదు. అదే సమయంలో తెలంగాణా నుంచి వచ్చిన అప్పటి ఎంపీ, ప్రస్తుత‌ బీజేపీ ప్రెసిడెంట్ బండి సజయ్ కి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చి చాలా సేపు మాట్లాడారు, దీంతో ఈ అవమానం తట్టుకోలేక జగన్ చాన్నాళ్ళు ఢిల్లీ వెళ్ళడం మానుకున్నారు. ఇపుడు జగన్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు, అది కూడా అమిత్ షా అపాయింట్మెంట్ ఖరార్ అయ్యాకే. తీరా చూస్తే చెప్పుకో పాదాలు ఇలా పెట్టారో? లేదో అది క్యాన్సిల్ అని చావు కబురు చల్లగా చెప్పారు. ఇది మళ్ళీ పరాభవమే.జగన్ విషయంలో అమిత్ షా ఇలా చేయడం ఏపీలోని విపక్షాలను ఆనందంగా ఉన్నా పరువు ఒక్క జగన్ కే పోవడం లేదు. మొత్తానికి మొత్తం అయిదు కోట్ల మంది ఆంధ్రుల ఆతాంభిమానాన్ని అమిత్ షా కించపరుస్తున్నారనుకోవాలి. నిజానికి ఒక ముఖ్యమంత్రిని మరీ ఇంతలా తీసిపారేయడం అపుడెపుడో ఇందిరాగాంధీ జమానాలో అంతా చూశారు. ఆనాడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ గొప్ప‌ కబుర్లు చెప్పిన బీజేపీ పెద్దలు ఇపుడు మాత్రం కాంగ్రెస్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.దేశంలోని మిగిలిన సీఎంలకు ఇదే మర్యాద అవుతోంది, అందుకే వారు దూరంగా ఉంటున్నారు. జగన్ మాత్రం చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తాను భంగపడుతూ ఏపీని కూడా భంగపరుస్తున్నారని అంటున్నారు. జగన్ విషయంలో మొదటి నుంచి అమిత్ షా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని సీబీఐ బోనులో చూడాలన్న టీడీపీ కోరికను కూడా ఆ విధంగా అప్పట్లో షా తీర్చారని అంటున్నారు. ఆయన వద్దకు నేరుగా వెళ్ళి జగన్ తనకు సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించమని కోరినపుడు షా ఏదో చేస్తారన్న నమ్మకం కల్గిందట. తీరా ఏపీకి వచ్చేసరికి షరా మామూలుగానే సీన్ ఉంది. ఒకసారి జగన్ సీబీఐ బోనులో సీఎం హోదాలో నిలబడి వచ్చారు కూడా. మొత్తం మీద చూసుకుంటే మోడీ వరకూ జగన్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న‌ అమిత్ షా మాత్రం ఎందుకో టార్గెట్ చేశారనే అంటున్నారు. మరి చూడాలి జగన్ వీటిని ఎలా నెగ్గుకువస్తారో.
 

Related Posts