YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 ఇంట్లోనే కరోనా పరీక్షలు

 ఇంట్లోనే కరోనా పరీక్షలు

 ఇంట్లోనే కరోనా పరీక్షలు
హైద్రాబాద్, జూన్ 6,
లక్షణాలు లేకుండా కరోనా వచ్చినట్లయితే ఇకమీదట ఇంట్లోనే వైద్యం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు చికిత్సకు రెడీ చేసింది. ఇప్పటికే వందల మంది రోగులను ఇంటి వద్ద నుంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ కొత్త గైడ్ లైన్స్ తో మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే కరోనా వచ్చి రోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయితేనే వారికి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయాలని నిర్ణయించారు.కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో పలు పరిశోధనల తర్వాత, పాజిటివ్ కేసులను పూర్తిగా విభజించారు. లక్షణాలు లేని వాళ్లకు ఇంట్లోనే ట్రీట్ మెంట్ చేస్తున్నారు.. అయితే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా సదరు రోగులు ఆచరించవలసి వుంటుంది. లేదంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్ మెంట్ చేస్తారు.ఒక రకంగా చెప్పాలంటే నిన్నా మొన్నటి వరకు కరోనా వచ్చిన వాళ్ళను అంటరాని వాళ్లుగా చూశారు… కానీ కొత్తగా ఐసీఎమ్మార్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో పరిస్థితి మొత్తం మారిపోయింది. తమ ఇంటిలోనే చికిత్స పొందవచ్చు. కండిషన్స్ మాత్రం తప్పని సరి.ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సదరు బాధితులకు చికిత్స చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందల మందికి పైగా బాధితులకు హోం ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. వీరంతా 17 రోజుల పాటు ఇంటి వద్దనే ఉంటూ వైద్యులు సలహాలతో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత డాక్టర్ల సూచనల మేరకు బయటికి వెళ్ళవలసి ఉంటుంది.లక్షణాలు లేని రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందితే వేరే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Related Posts