వ్యక్తిగత కక్ష్యలతో గ్యాంగ్ వార్
విజయవాడ, జూన్ 6
విజయవాడ సెంటర్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. ఇది కేవలం రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన భూ తగాదాలు కారణంగానే గొడవ జరిగిందని చెప్పారు. గ్యాంగుల మధ్య ఉన్న ఈ వార్ చివరకు ఒకరి హత్యకు దారితీసిందని వెల్లడించారు. విజయవాడ నగరంలో కత్తులతో స్వైరవిహారం సృష్టించిన గ్యాంగ్ వార్ ఘటనలో సీరియస్ గా దృష్టి సారించిన పోలీసులు దాడిలో పాల్గొన్న మొత్తం 13మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగరంలో పట్టపగలు కత్తులతో స్వైరవిహారం చేసి ఒకరి మరణానికి కారణం అయిన గ్యాంగ్ వార్ ఘటనలో మొత్తం 13మందిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు 6టీమ్స్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.విజయవాడ గ్యాంగ్ వార్ ఘటనలో కీలకంగా ఉన్న సందీప్,మణికంఠ ఇరువురు స్నేహితులు కాగా ఇద్దరికి కొద్ది రోజులుగా అనేక భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయినట్లు కమిషనర్ వెల్లడించారు. భూ వివాదాల కారణంగా నే ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారారని కమిషనర్ తెలిపారు. రెండు రోజుల ముందు జరిగిన ఘటన హత్యకు కారణమన్నారు. యనమలకుదురులో ఉన్న 7 సెంట్ల భూమిలో ఉన్న ఫ్లాట్ సెటిల్ మెంట్ గుర్తించామన్నారు. అయితే యనమలకుదురులో ఉన్న ఫ్లాట్ సెటిల్ మెంట్ కు సంబంధించి ప్రదీప్ రెడ్డి, ధనేకుల శ్రీధర్ అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ల్యాండ్ విషయంలో వివాదం రాగా మణికంఠ, సందీప్ లు జోక్యం చేసుకోగా ఇరువురికి వాగ్వాదం జరగడంతో 29వ తేదీన సందీప్ మణికంఠ ఇంటిపై దాడికి యత్నించడం పాటు మణికంఠ తల్లితో సందీప్ గొడపడ్డట్లు పోలీసులు విచారణలో తెలిసింది.మరోవైపు 29వ తేదీన రాత్రి తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మణికంఠ సందీప్ తో మరోసారి ఫోన్ లో గొడవకు దిగి 30వ తేదీన సందీప్ నిర్వహిస్తున్న స్టీల్ షాప్ వద్దకు వెళ్లి షాపులో పని చేస్తున్న ఇద్దరి సందీప్ అనుచరులపై దాడి చేయడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. దీంతో సందీప్ మణికంఠ, ఇద్దరు మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కర్రలు కత్తులు ,రాడ్లు తీసుకొని పటమటలో తోట వారి వీధిలో ఉన్న ప్లేస్ వద్దకు రాగా మాట్లాడుకుంటు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు కత్తులు విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడంతో సందీప్ ప్రాణాలు కోల్పోగా. మణికంఠకు తీవ్ర గాయాలు అయ్యాయి దీనితో మొత్తం దాడిలో పాల్గొన్న 30మంది యువకులను గుర్తించిన పోలీసులు 13మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.అయితే గ్యాంగ్ వార్ ఘటనలో ప్రాణాలు కొల్పయిన సందీప్ మరణం వెనక రాజకీయ కోణం ఉందని పెద్ద ఎత్తున వార్తలు రాగా అటువంటిది ఏమి లేదని తేల్చేసారు పోలీసులు.మొత్తం ఘటనకు వ్యక్తిగత కక్షలే కారణమని స్పష్టం చేస్తున్నారు గ్యాంగ్ వార్ లో పాలుపంచుకున్న మొత్తం 13మందిపై రౌడీ షీట్ తెరిచినట్లు వెల్లడించారు. దాడికి ఉపయోగించిన వెపన్స్ స్వాధీనం చేసుకొని వారందరిని రిమాండ్ కు పంపించామని కమిషనర్ తెలిపారు. విజయవాడ నగర ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా ఊరుకునేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.