YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

అప్పుడే  స్కూళ్లు వద్దు... 

అప్పుడే  స్కూళ్లు వద్దు... 

అప్పుడే  స్కూళ్లు వద్దు... 
న్యూఢిల్లీ, జూన్ 6, 
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను పలు దేశాలు సడలించిన తర్వాత.. పాఠశాలలను కూడా తెరవగా.. మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారు. దేశంలోని మెజార్టీ తల్లిదండ్రులు ఇదే అభిప్రాయం వ్యక్తంచేసినట్టు ఓ సర్వేలో వెల్లడయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాఠశాలల్లో భౌతికదూరం సహా ఇతర నిబంధనలను తీసుకుంటామని చెప్పినా తల్లిదండ్రుల్లో మాత్రం దీనిపై నమ్మకం కుదరడంలేదు. విర్చువల్ తరగతులనే కొనసాగించాలని సర్వేలో అభిప్రాయపడ్డారు.పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్ర మానవనరుల శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మొత్తం 224 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లోకల్‌సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 37 శాతం మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాని చోట పాఠశాలలు పునఃప్రారంభానికి తల్లిదండ్రులు మొగ్గుచూపారు. అయితే, 20 శాతం మంది తల్లిదండ్రులు మాత్రం దేశంలో కొత్త కేసులు నమోదు ఆగిన మూడు వారాల తర్వాత పాఠశాలను ప్రారంభించాలని, 13 శాతం మంది వ్యాక్సిన్ వచ్చినంత వరకూ తెరవద్దని కోరారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్‌లాక్ 1.0 మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత జులైలో పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ సమయంలో చాలా పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా పాఠాలను బోధిస్తున్నాయని, ఇవి కూడా ప్రభావవంతంగా ఉన్నాయని కొందరు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. పాఠశాలల ప్రారంభానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించాలని కోరుకుంటున్నారు.జులై నుంచి పాఠశాలను ప్రారంభిస్తామని, తొలుత సీనియర్ క్లాస్‌లు ప్రారంభమవుతాయని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు పునఃప్రారంభంపై పకడ్బంధీగా ప్రణాళికలు రూపొందించాలని, అయితే, విద్యార్థుల మధ్య భౌతికదూరం నిబంధనలు పాటించడం చాలా క్లిష్టమైన అంశమని 76 శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.ఫ్రాన్స్‌లో పాఠశాలలను తెరవగా.. 70 మంది చిన్నారులకు వైరస్ సోకిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో పాఠశాలలు ప్రారంభమైన రెండు వారాల తర్వాత 220 మంది విద్యార్థులకు వైరస్ సోకడంతో 10 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు క్వారంటైన్‌లోకి వెళ్లారు.
 

Related Posts