YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మృత్యుపాశాలు..

మృత్యుపాశాలు..

నల్గొండ జిల్లాలో విద్యుత్ ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంది. గతేడాది నుంచి ఇప్పటివరకూ 165 ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్‌ఘాతాలకు వందకు పైగా పశువులు సైతం బలైపోయాయి. ఇక వీధుల్లో.. వ్యవసాయక్షేత్రాల్లో కరెంట్ షాక్‌లు తగిన వారు అనేకమంది ఉన్నారు. ఈ ప్రమాదాల సంఖ్య కేవలం నల్గొండకే పరిమితం కాలేదు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లోనూ ఇదే తీరు. ఫలితంగా అనేక కుటుంబాల్లో విషాదానికి తెరపడడంలేదు. సిబ్బంది నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే విద్యుత్ఘాల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కరెంట్ తీగలు కిందకు వాలిపోతుండడం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రత సరిగా లేకపోవడం సమస్యను రెట్టింపు చేస్తోంది. దీంతో ప్రజలు ఈజీగా ప్రమాదాలకు గురవుతున్నారు. 

 విద్యుత్తు సరఫరా జరుగుతున్న తీగలు తెగిపడటం, గ్రామాల్లోని విద్యుత్తు నియంత్రికలపై ఉన్న హార్న్‌గ్యాప్‌ ఫీజులు వేసేందుకు యత్నించడం లాంటి ఘటనలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అంతేకాక విద్యుత్తు స్తంభం నుంచి వస్తున్న తీగ తెగడాన్ని గమనించకపోవడం, విద్యుత్తు వాహక వస్తువుల ద్వారా విద్యుదాఘాతానికి పలువురు బలవుతున్నారు. నియంత్రికల వద్ద ఎర్తులను ఏర్పాటు చేయకపోవడం కూడా సమస్యను రెట్టింపు చేస్తోంది. ఇంకా అనేక సమస్యలు ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ విభాగం స్పందించి ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఇక బాధితులకు నష్టపరిహారం కూడా పూర్తిస్థాయిలో అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts