దేశంలో ఏక విద్యుత్ పాలసీ
కడప జూన్ 6,
దేశానికి దృఢమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత పీఎం నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఆర్టికల్ 370డి బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కూడా బీజేపీదే. జమ్మూలో బీజేపీ యువతకు ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అవకాశాలు కల్పించిందపి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించడంలో బీజేపీ ఎనలేని కృషి చేసింది. తీవ్రవాదుల నిర్మూలనకు బీజేపీ అనేక చర్యలు చేపట్టింది. ప్రపంచ దేశాల్లో భారత దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో పీఎం పాత్ర అమోఘమని అయన అన్నారు. దేశంలో ఏక విద్యుత్ పాలసీని తీసుకువస్తున్నాం.. తద్వారా ప్రజల పై విద్యుత్ భారం పడకుండా చూస్తున్నాం. ప్రధాని పిలుపు మేరకు దేశంలో ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించారు.. వారందరికీ ధన్యవాదాలని అన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీని పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా తయారుచేసిందే. ప్రజల కోసం కొత్త పథకాల ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రాలకు అందాల్సిన బిల్లులు కూడా వెంటనే విడుదల చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. చట్టాలలో ఉన్న లొసుగులను ఎమెండ్ మెంట్ ద్వారా మార్పు చేయడానికి బీజేపీ నడుం బిగించింది. ఏపీ పైన బీజేపీ ప్రత్యేక దృష్టి పెడుతుందని అయన అన్నారు.