YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా నియంత్రణలో వైఫల్యం

కరోనా నియంత్రణలో వైఫల్యం

కరోనా నియంత్రణలో వైఫల్యం
విజయవాడ జూన్ 6,
నరేంద్ర మోడీరెండవసారి అధికారం చేపట్టి సంవత్సరం అయింది. మోడీ చేతుల్లో భారతదేశం అభివృద్ధి దారుణంగా దెబ్బ తిన్నది.  అభివృద్ధి 5 శాతానికే పరిమితమైంది. 30 లక్షల ఉద్యోగాలు పోయాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతబడ్డాయని  ఎపిసిసి అధ్యక్షుడు శైలజనాధ్ అన్నారు.  శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ముడి చమురు ధరలు తగ్గితే ,పెట్రోల్ ధరలపై సెస్ పెంచారు. అత్యంత సన్నిహితులకు సుమారు 40 వేల కోట్ల రూపాయలపైనే రైట్ ఆఫ్ చేశారు. కరోనా సమయంలో ఇంత నిర్దయగా ఏ ప్రభుత్వం ప్రవర్తించలేదు. గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ విధించి, వలస కార్మికుల పాలిట శాపంగా మారారని అయన విమర్శించారు. కరోనా నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక పక్క విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ ,మరో పక్క స్వదేశీ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నారు. సంఖ్య ఉందని పౌరసత్వ చట్టం తీసుకొచ్చారు,రాజ్యాంగం నిషేధించిన తరువాత ఏ విధంగా పొరసత్వ చట్ట సవరణ తెచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఈ ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఎం చేశారో చెప్పాలి,ఇక్కడి ప్రభుత్వానికి అడిగే ధైర్యం లేదు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజి ఎక్కడ?విభజన చట్టంలోని అంశాలను ఏమి అమలు చేశారని ప్రశ్నించారు. ఒకే దేశం ఒకే ధర కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే రైతు పంటకు మద్దతు ధర అని ప్రకటించారు. ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి ,కొనుగోలు చేయాలని అయన డిమాండ్ చేసారు.

Related Posts