YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం 

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం 

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం 
యాదాద్రి జూన్ 06
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా  తనిఖీ  చేసారు.  వర్షా కాలం పంటల సీజన్ ప్రారంభమైతున్న సందర్భంగా  మోత్కూర్ ఎస్సై హరిప్రసాద్, మండల వ్యవసాయాధికారిణి స్వప్న ఆధ్వర్యంలో తనిఖీ లు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మోత్కూర్ లోని లక్ష్మీ నరసింహా , శ్రీరామ, మన గ్రోమోర్ మరియు శ్రీ బాలాజీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ మరియు సైడ్స్ దుకాణాల్లో విత్తన లైసెన్స్ , కాటన్ సీడ్స్ స్టాక్ , పీసీలు  తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని, స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని, ఎంఆర్పి ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, వీటి ధరలను సూచించే  బోర్డులు  దుకాణాల ముందు పెట్టాలని సూచించారు. ఎవరైనా గాని కల్తీ విత్తనాలు విక్రయించినచో  పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, గ్రామాలలో ఎవరైనా వచ్చి పత్తి విత్తనాలు విక్రయించినట్లు అయితే సంబందిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. కొంత మంది కలుపు తీయకుండా ఉంటుంది అని హెచ్ డీ కాటన్ విత్తనాలు కొంతమని అంటున్నారు కానీ ఏ విత్తనాలు కూడా కలుపు తీయకుండా ఉన్నటువంటి విత్తనాలు లేవు అలాగే హెచ్ డీ కాటన్ పత్తి విత్తనాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కనుక ఎవరైనా దళారులు బయట అమ్మితే ఈ విత్తనాలను కొనకండి అలాగే ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతు దొరికితే వారిపైనే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Posts