పదవ తరగతి పరీక్షలను రద్దు చేయండి
జగిత్యాల జూన్ 06
కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8వ తేదీ నుండి నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షలనురద్దు చేయాలని తల్లిదండ్రుల చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ( టి పి ఎస్ హెచ్ యం ఏ) రవికంటి పవన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండటం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని పదవ తరగతి పరీక్షలను రద్దు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమని తెలంగాణ స్టేట్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అసోసియేషన్(టి పి ఎస్ హెచ్ యం ఏ)వైస్ ప్రెసిడెంట్ రావికంటి పవన్ కుమార్ తెలిపారు