పదోతరగతి పరీక్ష ఏర్పాట్లు పూర్తి
జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు
జగిత్యాల జూన్ 06
పదవతరగతి పరీక్షల రీ షెడ్యూల్ మేరకు జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, హైకోర్టు సూచనలు, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలతో అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పదవతరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షణ గావించారు.ఈ సందర్భంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ...జిల్లాలో 11,800 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. కరోనా కోవిడ్ 19 నిబంధనలననుసరించి, గతంలో ఉన్న పరీక్ష కేంద్రాలు 68 కి అదనంగా మరో 61 కేంద్రాలను ఎంపిక చేసి, మొత్తం 129 కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా, మాస్కులు పంపిణీ చేయడంతో పాటుగా, పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం జరుగుతుందన్నారు.ప్రతి బెంచికి ఒక విద్యార్థి చొప్పున కనీసం ఒక మీటర్ దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని డిఈఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు.