జిల్లా వ్యాప్తంగా విత్తనాల , ఎరువుల దుకాణాలలో పోలీసులు తనిఖీలు
జగిత్యాల జూన్ 06
శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా ఏర్పడి జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విత్తన ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా విత్తన సంచులు పై ఉన్న లేబుల్ లో ఉన్న వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. గోదాములలో నిల్వ ఉంచిన విత్తన సంచుల, ఎరువుల వివరాలను సేకరించారు. లైసెన్స్ వివరాలను అలాగే విత్తన సంచులను సరఫరా చేసిన కంపెనీ వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రతిరోజు ఫర్టిలైజర్ షాప్ ల పై తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ తనిఖీలలో ఆయా పోలీస్ స్టేషన్స్ ల సబ్ ఇన్స్పెక్టర్ లు అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.