YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 ప్రియురాలితో నగ్నచిత్రాలు... నవవధువు ఆత్మహత్య

 ప్రియురాలితో నగ్నచిత్రాలు... నవవధువు ఆత్మహత్య

 ప్రియురాలితో నగ్నచిత్రాలు... నవవధువు ఆత్మహత్య
బెంగళూర్. జూన్ 6,
పెళ్లి జరిగి నెల రోజులు తిరక్కముందే నవవధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషాద ఘటన వెలుగుచూసింది. పెళ్లికి ముందే మరో యువతితో ఆ సంబంధం పెట్టుకున్న భర్త.. ప్రియురాలితో నగ్నచిత్రాలు చూసి నవ వధువు అఘాయిత్యానికి పాల్పడింది. మోసపోయానన్న మనస్థాపంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మైసూరులో చోటుచేసుకుంది.నగరంలోని ఆనంద నగర ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్‌(24)కి భావనతో నెల నెల రోజుల కిందట వివాహం జరిగింది. అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే భర్త బండారం బయటపడింది. పెళ్లికి ముందు నుంచే తన భర్తకి వేరొకరితో శారీరక సంబంధముందని తెలిసింది. ప్రియురాలితో శృంగారం చేస్తున్న సమయంలో నగ్నంగా దిగిన ఫొటోలను భర్త ఫోన్‌లో చూసి షాక్‌కి గురైంది. అదే విషయాన్ని పెద్దల మధ్య పెట్టింది. ఇరుకుటుంబాల పెద్దలు కూర్చుని భార్యాభర్తల మధ్య రాజీ చేశారు. అయినా భర్త పద్ధతి మార్చుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. పెళ్లి పేరుతో మోసపోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts