జూన్ 14 నుంచి ఆర్కే మఠ్ కోర్సులు
హైద్రాబాద్, జూన్ 6,
వైరస్ లాక్‌డౌన్ వేళ పలు సంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రామకృష్ఠ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌సిట్ట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ సైతం ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తోంది. తాజాగా, చిన్నారుల కోసం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. వివేకానంద బాలవికాస్ కేంద్రం ‘శ్రద్ధ’పేరుతో ఈ కోర్సును నిర్వహిస్తోంది. కోర్సులో భాగంగా యోగసనాలు, ప్రాణాయామ, నైతిక తరగతులు, భజనలు తదితర అంశాలను బోధించనున్నారు. ఈ తరగతులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. నాలుగు నుంచి పది తరగతులు విద్యార్థులు ఇందులో చేరవచ్చు. రెండు నెలల పాటు కోర్సు ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. జూన్ 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు దాదాపు రెండు నెలలు తరగతులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం మొబైల్, మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోర్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో యోగాసనాల ద్వారా కరోనాను నియంత్రించవచ్చని పేర్కొంది. ఇందుకు అవసరమైన ప్రత్యేక యోగాసనాలకు సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.