YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత, చైనాల మధ్య చర్చలు

భారత, చైనాల మధ్య చర్చలు

భారత, చైనాల మధ్య చర్చలు
సామరస్య పూర్వకంగా చర్చించుకోవాలని నిర్ణయం
న్యూఢిల్లీ, జూన్ 6, 
గత నెల ప్రారంభంలో భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగి ఒకరిపైఒకరు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.నెల రోజులుగా భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరదించడానికి కీలక ముందుడుగు పడింది. సరిహద్దు వివాదంపై లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది. తూర్పు లడఖ్‌ చూశాల్‌లోని మోల్దోని బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద జరుగుతున్న సమావేశానికి భారత్ నుంచి లేహ్ 14 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా సైన్యం తరఫున టిబెట్ మిలటరీ రీజియన్ కమాండర్ హాజరయ్యారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్ నిర్ధిష్ట ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. పాంగాంగ్ సో, గాల్వన్ లోయ నుంచి చైనా సైన్యం వైదొలగాలని,తమభూభాగాల్లో వేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను తొలగించాలని భారత్ డిమాండ్ చేసినట్టు సమాచారం.ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాధికారులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.. మిలటరీ, దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నాయని ఆర్మీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరు దేశాలకు చెందిన స్థానిక కమాండర్ల మధ్య 12 రౌండ్ల పాటు జరిగిన చర్చలు, మేజర్ జనరల్ స్థాయి అధికారులు మధ్య మూడు సార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరు దేశాల దౌత్య అధికారుల మధ్య చర్చల సందర్భంగా అవగాహనకు వచ్చిన మర్నాడే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గాల్వన్ లోయ, పాంగాంగ్ సో, గోగ్రాలో యథాతథ స్థితి కొనసాగించాలని భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటిమౌలిక వసతులు, నిర్మాణాలు చేపట్టవద్దని చైనా సైన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోందిగత నెల ప్రారంభంలో ప్రతిష్టంభన ప్రారంభమైన తరువాత, పాంగాంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్‌చక్, దౌలత్ బేగ్ ఓల్డీ వంటి వివాదాస్పద ప్రాంతాలలో చైనా దళాలు దూకుడుగా వ్యవహరించడంతో భారత్ కూడా అదే ధీటుగా స్పందించింది. చైనా విధానాన్ని అవలంబించాలని భారత్ నిర్ణయించింది. పాంగాంగ్ సో, గాల్వన్ లోయలో సుమారు 2,500 మంది సైనికులను చైనా మోహరించింది. క్రమంగా తాత్కాలిక మౌలిక సదుపాయాలు, ఆయుధాలను పెంచుతుంది. పాంగాంగ్ సో ప్రాంతం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక వైమానిక స్థావరాన్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఎల్‌ఏసీ వైపు చైనా రక్షణ మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతోందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Related Posts