YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమ్మ ప్రేమ గెలిచింది

అమ్మ ప్రేమ గెలిచింది

అమ్మ ప్రేమ గెలిచింది
ఏనుగును కాపాడిన గ్రామస్థులు
రాంచీ, జూన్ 07
ఈ సృష్టిలో తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని నిరూపించే ఘటన ఇది. గుంతలో ఇరుక్కుపోయిన తన బిడ్డను తల్లి ఏనుగు గంటల తరబడి శ్రమించి బయటకు లాగింది.ఇటీవల కేరళలో ఏనుగును హతమార్చిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్‌ ఇవ్వడంతో అది తినేందుకు ప్రయత్నించిన ఏనుగు నోటి భాగం తీవ్రంగా దెబ్బతిందని కథనాలు వచ్చాయి. కానీ ఆ ఏనుగు తిన్నది పైనాపిల్ కాదు కొబ్బరికాయ అని తర్వాత తేలింది. గాయం బాధ తాళలేక ఏనుగు నీటిలో ఉండిపోయి.. ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జంతువుల పట్ల మనుషులు ఇంత దారుణంగా వ్యవహరిస్తుండగా.. ఇరుకైన బురద గుంటలో కూరుకుపోయిన తన బిడ్డను బయటకు తీయడానికి ఓ తల్లి ఏనుగు తీవ్రంగా శ్రమించిన వీడియో వైరల్ అవుతోంది.గుంత ఇరుకుగా ఉండటం.. తీసే క్రమంలో జారుతుండటంతో ఆ తల్లి ఏనుగు తీవ్రంగా ఇబ్బంది పడింది. చుట్టూ జనం గుమికూడటంతో దాంతోపాటు ఉన్న ఏనుగులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కానీ తల్లి ఏనుగు మాత్రం బిడ్డ కోసం అక్కడే ఉండిపోయింది. అటు తిరిగి, ఇటు తిరిగి రకరకాలుగా తొండంతో బిడ్డను గుంత నుంచి పైకి లాగడానికి ప్రయత్నించింది. రెండు గంటలపాటు ప్రయత్నించిన తర్వాత బుల్లి ఏనుగు బయటకొచ్చింది. దీంతో ఆ తల్లి ఏనుగు తన బిడ్డను తీసుకొని ఏనుగుల మంద వైపు వెళ్లింది.గ్రామస్థులు సమీపంలోనే ఉన్నా దాని దగ్గరకు వెళ్లి సాయం చేయకపోవడానికి ఓ కారణం ఉందని ఈ వీడియోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తెలిపారు. ‘‘బిడ్డను బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్న చోటుకు మనుషులు వెళ్తే ఏనుగుకు కోపం వచ్చి దాడి చేస్తుంది. ఒకవేళ తన బిడ్డను బయటకు తీయడం సాధ్యం భావిస్తే.. అదే అక్కడి నుంచి వెళ్లిపోయి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. మనుషులు తన బిడ్డను బయటకు తీశాక.. దాన్ని తీసుకొని వెళ్తుంద’’ని ఆయన తెలిపారు. 2015లో జార్ఖండ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ తల్లి ేనుగు 11 గంటలపాటు శ్రమించి బిడ్డను గుంత నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో దాని ధ్యాస మళ్లించిన గ్రామస్థులు గుంతను వెడల్పు చేసి గున్న ఏనుగు బయటకు వచ్చేలా చేశారు.

Related Posts