YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పెళ్లిలో కొత్త ట్రెండ్.. దండలు పోయి మాస్కులొచ్చే డాం డాం!

పెళ్లిలో కొత్త ట్రెండ్.. దండలు పోయి మాస్కులొచ్చే డాం డాం!

పెళ్లిలో కొత్త ట్రెండ్.. దండలు పోయి మాస్కులొచ్చే డాం డాం!
హైద్రాబాద్, జూన్ 07
కరోనా వైరస్ వల్ల ప్రజల జీవితాలే మారిపోయాయి. ఒకప్పుడు బయట ఎంతో స్వేచ్ఛగా విహరించిన మనుషులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. కనిపించని శత్రువు ఎప్పుడు దాడి చేస్తుందనే భయంతో బతికేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెళ్లిల్లు చేసుకోవడం కూడా గగనమైపోయింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. తక్కువ మంది అతిథులు మధ్యే పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. దీని వల్ల ఖర్చులైతే తగ్గుతున్నాయి. కానీ, పెళ్లి సందడి మాత్రం కనిపించడం లేదు.ఈ కొత్త ట్రెండులో వధువరులు ఇప్పుడు దండలను మాత్రమే కాదు.. మాస్కులను కూడా మార్చుకుంటున్నారు. వరుడు.. వధువుకు మాస్కు తొడిగితే.. వరుడు తిరిగి ఆమెకు మాస్కు తొడగడం ఇప్పుడు సాంప్రదాయంగా మారింది. అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ జంట తమ పెళ్లిలో ఈ విధంగానే మాస్కులు మార్చుకుని ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో కొందరు ‘‘వైరస్సా? ఇక వైరస్సే ఉండదు’’ అనడాన్ని మీరు వినొచ్చు. టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Related Posts