YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం విదేశీయం

కుక్కల కోసం ప్రత్యేక విమానం

కుక్కల కోసం ప్రత్యేక విమానం

కుక్కల కోసం ప్రత్యేక విమానం
న్యూఢిల్లీ, జూన్ 07
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఎక్కడివాళ్లు అక్కడే బంధీలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు లాక్‌డౌన్‌లో సవరణలు చేయడంతో ప్రజలు రైలు, బస్సులు, సొంత వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే, కొందరు సంపన్నులు తమ పెంపుడు జంతువులను బాగా మిస్సవుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తమతో తీసుకెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో చాలా బాధపడిపోతున్నారట. ఈ నేపథ్యంలో అక్రిషన్ ఏవియేషన్ అనే ఓ ప్రైవేట్ జెట్ సంస్థ కేవలం పెంపుడు జంతువుల కోసమే విమానం నడిపేందుకు ముందుకొచ్చింది.ఈ సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్‌కు వచ్చిన ఐడియా ఇది. పెంపుడు కుక్కలకు దూరంగా ఉన్నామని తపించే యజమానుల బాధను తీర్చే ఉద్దేశంతో ఆమె అక్రియషన్ ఏవియేషన్‌ను సంప్రదించింది. ఇందుకు ఆ విమానయాన సంస్థ కూడా సిద్ధం కావడంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. ‘‘కొందరు తమ పెంపుడు జంతువులను తమతో పాటు విమానంలో తీసుకెళ్లాలని అనుకుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు అది సాధ్యం కాదు. అందుకే జంతువుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. ఈ మేరకు అక్రిషన్ ఏవియేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని తెలిపారు.ఈ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. కేవలం ఆరు పెంపుడు జంతువులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. విమానానికి చెల్లించాల్సిన మొత్తం అద్దె రూ.9.60 లక్షలు కాగా ఒక్కో సీటుకు రూ.1.60 లక్షలు వసూలు చేస్తున్నారు. నిర్ణయించారు. ఈ విమానంలో ఇప్పటికే నాలుగు సీట్లు బుక్కయ్యాయి. ఇంకో రెండు సీట్లు బుక్ కావల్సి ఉంది. ఒక గోల్డెన్ రిట్రీవ‌ర్ శున‌కాలు, లేడీ ఫిజంట్ ప‌క్షి , రెండు షిహూ తుజ‌స్‌లు ఈ విమానంలో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాయి. తొలి దశలో ఢిల్లీ నుంచి ముంబయికి ఈ ప్రత్యేక విమానాన్ని నడుపుతారు. ఇదంతా చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ‘‘మీరంటే ఉన్నోళ్లు’’ అనాలి అనిపిస్తోంది కదూ.
 

Related Posts