*దత్త స్తుతి*
1.జో సత్య అహే పరిపూర్ణ ఆత్మ !
జో నిత్య రాహే ఉదిత ప్రభాత్మ!
జ్ఞానే జయాచ్య నర హో కృతార్ధ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!
1. ఏది సత్యమైన పరిపూర్ణ ఆత్మ యో,ఏది నిత్యమైన పరిపూర్ణ తేజోమయమైన జ్యోతిస్వరూపమై జ్ఞానం ను తెలియజేసి కృతార్థుడు చేయునట్టి వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
2.అఖండ ఆత్మా అవినాషి దత్త!
తయా పది లాహిత జే స్వచ్చిత్త!
వీత్త భ్రమా సోడితి తే కృతార్ధ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!!
2.ఎవరు వినాశనం లేని అఖండ ఆత్మయో, ఎవరు వాని పాదముల మీద శ్రద్ద,నమ్మకం ఉంటే వారికి ధనం ఇచ్చి,మాయాభ్రమ లను తొలగించి కృతార్థు లను చేస్తారో వారే ఆనంద గురు సమర్ధ.
3.జో జాగృతి స్వప్న సుషుప్తి సాక్షి!
జో నిర్వికారే సకలా నిరీక్షి!
వీక్షి పరి జ్యాసి నసే నిజార్ధ!
పూర్ణ ఆనంద గురు సమర్ధ.
3.ఎవరు జాగృతి, స్వప్న, సుశుప్తి అన్నింటిలో సాక్షిగా ఉండి,ఎవరు నిరకారుడై అందరిని సర్వదా నిస్వార్థంగా గమనించు చున్నారో వారే
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ
4.జలిం స్ధలీ సర్వహి వాస్తు మాజీ!
వ్యాపునీ రాహెచీ తాయాసీ రాజీ!
జో ఠెవీ భావే నరహో కృతార్ధ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!
4..జలము,స్థలములో సర్వం తనేఅయ్యి నివసిస్థూ, అంతటా వ్యాపించి ఉండి,వారికి హృదయ సమర్పణ చేసి భక్తి భావంతో ప్రార్థిస్తే తరిపజేస్తారో వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
5.జో దృశ్య తేరూప నసే జయచే!
దృశ్యంత రూప అవికారి జ్యంచే!
స్వరూప తే చీ అవినాషి అర్ధ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ
5.మనకు కనిపిస్తున్న ఏ దృశ్య రూపమును తెలుసుకోలేమో,ఎవరు నిర్వికారుడై,అవినాశనముగా కనపడుతున్నాడో వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
6.దృష్యసి ఘోతా నచే ఘవే జో!
స్వరూప తత్ సత్ ప్రభుచెం స్వతేజే!
స్వయం ప్రకాశో జగిజో పదార్థ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!
6.ఎలా కనపుతున్న రూపమును తెలుసుకోలేమో,ఏ ఆకారం లేని వానికి అసలు అంతమే లేదో,స్వయం ప్రకాశకుడై ఈ జగత్తులో కేవలం పదార్ధంగా ఉన్నారో వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
7.అసోనీ సవీత్ర గురు ప్రసాద!
వినాన లహే కారతాహి ఖాడా!
భేదాచి వాత్రే కరిజో అపార్ధ!
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!
7..ఎవరు ప్రభువై సర్వత్రా తేజోమయమైన స్వయం ప్రకాశమమో, ఎవరు ద్వేషించినను భేద భావం ఎంచక కృప చూపువరో వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
8.అనన్య భావే భజతా అనన్య!
లభ్య ప్రభు జో నచే హాతి అన్య!
సన్యా స్త సర్వోషణ తారణార్ధ !
తో పూర్ణ ఆనంద గురు సమర్ధ!
8.ఎవరు అనన్య భావంతో భజింపబడు అనన్యుడో,ఎవరు వారు తప్ప అన్యులు లేని లాభమును ప్రసాదించే ప్రభువో, ఎవరు సంన్యాస రూప ధారణతో సర్వులను తరింపజేయుచున్నారో వారే పూర్ణ ఆనంద గురు సమర్ధ.
9.మాగే తుకరామా తయాసి దత్త!
హే వాసుదేవా కరునీ నిమిత్త!
హే స్త్రోత్ర చిన్మత్త పరా సమర్ధ!
ధ్యాయా హారాయ సకల ధ్యానార్ధ!
9.హే దత్తా!తుకారాముడు అడుగుతున్నారు. ఈ వాసుదేముడు నిమిత్త మాత్రముగా ఈ స్త్రోత్రo రచించి చదివిన వారికి చిన్మాత్రముగా కష్టములు హరించి,సకల సుఖములు ప్రసాదించుతాడు ఆ హరి.
10.గాణుగాపూరీ అఠరాసే సత్తా వసి సకావం!
వుదే లే స్త్రోత్ర హే అధి వ్యాధి హారి హరి కృధీ!!
10.గాణుగాపురంలో శ. క.1827సంవత్సరం లో రచింపబడిన ఈ స్త్రోత్రo చదివిన ఆది, వ్యాధి ల నుంచి ఆ శ్రీ హరి అయిన పండరినాధుడు కాపాడుతారు.
శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి విరచిత శ్రీ దత్త స్తుతి సంపూర్ణం.
తెలుగు భావం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.