YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 కంట్రోలో లో లేని కరోనా

 కంట్రోలో లో లేని కరోనా

 కంట్రోలో లో లేని కరోనా
న్యూఢిల్లీ, జూన్ 8,
దేశంలో ఐదో విడత లాక్ డౌన్ నడుస్తోంది. పేరుకు లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ దాదాపుగా అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఒక్క విద్యాసంస్థలు మాత్రం ప్రారంభం కాలేదు. రేపటి నుంచి హోటల్స్ , రెస్టారెంట్లు, ప్రార్థనామందిరాలు, దేవాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. ఇదే ఆందోళన కల్గించే అంశం. కరోనా అతి త్వరగా అంటుకునే ప్రమాదమున్నవి ఈ రెండే కావడం గమనార్హం. ప్రార్థనాలయాలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించినా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు తొలి నుంచి హెచ్చరిస్తున్నారు.అసలు కరోనా మహ్మమ్మారి భారత్ లో విదేశాల నుంచి వచ్చిన వారితో మాత్రమే కాకుండా మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే దేశమంతటా అంటుకుంది. మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. అప్పటికే వారి కారణంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. రేపటి నుంచి తిరిగి ప్రార్థనాలయాలు తెరుచుకోనున్నాయి.ఇక కరోనా వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశమున్న హోటల్స్ దేశ వ్యాప్తంగా అన్నీ తెరుచుకున్నాయి. నిబంధనలను ఎన్ని పెట్టినా ఇక్కడ వైరస్ ను కట్టడి చేయడం కష్టసాధ్యమైన పని. అయినా రెండు నెలలు దాటి పోవడంతో హోటల్స్ , రెస్టారెంట్లు యాజమాన్యాలు ఆర్థికంగా నష్టపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలో అన్ని రెస్టారెంట్లు, హోటల్స్ రేపటి నుంచి తెరుచుకుంటున్నాయి. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఇప్పటికే రెండున్నర లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దాదాపు ఏడువేల మంది మరణించారు. ఇప్పటికే రోజుకు తొమ్మిది వేల కేసులుకు పైగానే దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశమే. మరో రెండు నెలల్లో పదిహేను లక్షలకు కేసులు చేరుకునే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో నుంచి ప్రార్థనాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకవడటంతో కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం దీనికి కొన్ని నిబంధనలను పెట్టినా వాటి అమలుపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts