YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇద్దరు దొంగలను పట్టుకున్న రైల్వే పోలీసులు

ఇద్దరు దొంగలను పట్టుకున్న రైల్వే పోలీసులు

రైళ్లల్లో ప్రయాణికులుగా కూర్చుంటారు. అదను చూసి తోటి ప్రయాణికుల బ్యాగులు, నగదు దొంగిలిస్తుంటారు. రైలు దొంగతనాలపై విచారణ జరిగిప రైల్వే పోలీసులు చిరవకు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన  ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నాడు రైల్వే ఏడిజి. కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నిందితులనుంచి పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,త మిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఉన్న నిందితుడు హర్ విందర్ సింగ్ నుంచి  70 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  గడిచిన రెండు నెలల్లో రైల్వే పోలీసులు,  జీఆరపీఏఫ్  ఆధ్వర్యంలో సుమారు కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశామని అయన వెల్లడించారు. ప్రయాణికులు కూడా రైలులో ప్రయానించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైలులో కిటికీ వద్ద ఉండే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అయన సూచించారు. ప్రయాణాలలో వృద్దులు, ఒంటరి ప్రయాణికులను టార్గెట్ గా చేసి దొంగ తనాలకు పాల్పడతారు. ప్రయాణాలలో బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించే ప్రయాణికులే వీరి టార్గెట్. ప్రయాణికులు బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించడం సురక్షితం కాదని అయన అన్నారు.

Related Posts