YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 తమ్ముళ్లలో ఆపరేషన్ టెన్షన్

 తమ్ముళ్లలో ఆపరేషన్ టెన్షన్

 తమ్ముళ్లలో ఆపరేషన్ టెన్షన్
విజయవాడ, జూన్ 8, 
ఏడాది పాలనలో జగన్ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీలో వుండడంతో దూసుకుపోతున్నారు. ఇక టీడీపీ తరఫున ఎన్నికయిన వారు మాత్రం స్తబ్ధంగా వున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలీని అయోమయం నెలకొని వుంది.  తాజాగా గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నుంచి 10 మందిపైగా ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సొంత పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతోందన్నారు. వైసీపీ ఏడాది పాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని గిరి చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే విపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయన్నారు. వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విపరీతమయిన ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. రాష్టాన్ని అప్పులు ఊబిలో ముంచి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదని గిరి చెప్పుకొచ్చారు.పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతాని గిరి ఏ ప్రాతిపదికన చెప్పారోనని అంతా చర్చ జరుగుతోంది. 23 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు విధేయులుగా పేరున్న అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి వంటివారిని మినహాయిస్తే మిగిలినవారి పరిస్థితి ఏంటి? ఎవరెవరు జంప్ జపాంగ్ లు కానున్నారనేది అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వంశీ, గిరిధర్ లాంటివారు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ గూటికి చేరుతున్నట్లు గత కొన్ని రోజులుగా వరుసగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే జిల్లాకు చెంది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమై చేరికపై మాట్లాడారని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో ఎమ్మెల్యే సాంబశివరావు సమావేశమై చర్చించారు.టీడీపీని వీడేది లేదని తేల్చిచెప్పారు. టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. పర్చూరు నియోజకవర్గ ప్రజలు తనను రాజకీయ నేతగా కన్నా తమ కుటుంబ సభ్యునిగానే చూశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలిగామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పుకొచ్చారు. దీంతో ఏలూరు సాంబశివరావు పార్టీ మార్పుపై వచ్చే వార్తలు వాస్తవం కాదని అనుకోవచ్చు.  ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గుడ్‌బై చెప్తారంటూ గత కొన్ని నెలల నుంచి విశాఖలో జోరుగా ప్రచారం జరిగింది. వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందంటున్నారు. వైసీపీలోకి గంటా వస్తే పార్టీకి మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆ మంత్రి అధిష్టానం వద్ద గట్టిగా వాదించారట! దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైపు వెళ్ళేందుకు ఎవరెవరు ఎదురుచూస్తున్నారో? ఇది కేవలం వ్యూహాత్మకంగా గిరి అన్నమాటలా? టీడీపీ నేతలు నిజంగా జగన్ గూటికి చేరేందుకు ఊబలాటపడుతున్నారా అనేది తేలాల్చి వుంది. 

Related Posts