YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జనాభా లెక్కలు మళ్లీ వాయిదా

జనాభా లెక్కలు మళ్లీ వాయిదా

జనాభా లెక్కలు మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ, జూన్ 8,
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య నిర్వహించాల్సిన జనగణన, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్పీఆర్) కార్యకలాపాలు కోవిడ్ -19 కారణంగా నిలిపివేయగా, ప్రస్తుతం దానిని వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశం ఉంది. కేంద్రం విధించిన గడుపు ప్రకారం జనాభా లెక్కల సేకరణకు మరో మూడు నెలలు మాత్రమే ఉండటం.. ప్రస్తుతం అందరికీ అనువైన సమయం కాదని అంచనాకు వచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కాలంలో మొదటి దశను ప్రారంభించి పూర్తి చేయడం లేదా మొత్తం ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభించనున్నారు.జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో భాగంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాలు, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్), తరువాత జనాభా గణన 2021 ఫిబ్రవరి 9, 28, మార్చి 1 మధ్య చేపడతారు. సవరించిన జనాభా లెక్కల షెడ్యూల్‌ నిర్ణయానికి ముందు ప్రభుత్వం కరోనా మహమ్మారి పరిస్థితి తీవ్రతను పర్యవేక్షిస్తోంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్స్‌ చెందిన ఇద్దరు మాజీ అధికారులు ఎఆర్ నందా, జెకె బంతియా అభిప్రాయాలను సేకరించింది.కరోనా వైరస్ కారణంగా అనేక దేశాలలో జనాభా లెక్కల నిలిపివేయగా, కొన్ని వాయిదా వేశాయి. ఆన్‌లైన్ లేదా నిర్దిష్ట ఆరోగ్య, భద్రతా నిబంధనలకు అనుగుణంగా దశలవారీగా తిరిగి ప్రారంభమవుతాయని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ‘ఆదర్శవంతంగా, డేటా పోలికను నిర్ధారించడానికి‘సాధారణ ’సంవత్సరంలో జనాభా గణన జరగాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Related Posts