YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రభుత్వం ఎంత మర్యాదగా,  జాగ్రత్తగా చెప్పినా,  వినక పోతే

ప్రభుత్వం ఎంత మర్యాదగా,  జాగ్రత్తగా చెప్పినా,  వినక పోతే

 *ప్రభుత్వం ఎంత మర్యాదగా,* 
  *జాగ్రత్తగా చెప్పినా*
    **వినక పోతే* 
కరోనాపై అసలు విషయం తెలుసుకోని  ప్యానిక్ అవకండి..* 
ఇది భ్రమ కాదు.
పక్క దేశాల్లో జరుగుతున్న వాస్తవం. 
*... చదివి పాటిస్తే మంచిది ...*
*మనం పీల్చేది మాములు గాలి కాదు...*
*మనం పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు...*
*మన చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు...*
*మన  కంటికి కనబడేదంతా నిజం కాదు...*
ఇప్పటివరుకు **కరోనా వచ్చినవారు, వారి పక్కింటివారు, వీధిలోని వారు, ఏరియావాళ్లు మీలానే ఆలోచిస్తూ మాకు రాదు  అని అజాగ్రత్తగా ఉన్న వారే కరోనాకు గురి అవుతున్నారు.* 
కరోనా నాకు దగ్గరగా లేదుగా.... అని అనుకో కూడదు  *మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి* మన  చుట్టూ *కరోనావైరస్ ఉంది...*
*ఏమీ అవ్వదు* అనుకుంటే *మనం మన కుటుంబం,  బంధువులు, స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..*
మనకంటే ఎంతో.. *ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది....*
*సామాన్యుల నుండి అద్ధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు....*
కరోనా వస్తే ఏమౌతుంది...?
జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా...! 
*సీజనల్ వ్యాధిలాగా నాలుగురోజులు ఉండి పోతుంది అనుకోకండి....*
దగ్గు దగ్గి దగ్గి *ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్*.... 
*ఊపిరి తీసుకోవడం కష్టం* అవుతుంది... 
ఆ దగ్గు వల్ల *లంగ్స్ దెబ్బతింటాయి..* 
*లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది...*
*గుండె  గతి తప్పుతుంది*... 
ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి స్వస్థత త్వరగా తిరిగి వస్తుంది లేకుంటే ఇబ్బంది పడతారు.
హాస్పిటల్ లో చేర్చటానికి మన  అనుకున్న వారు కూడా రాలేరు .
మనం జాగ్రత్తలు తీసుకోకుండా కరోనా వ్యాధి వ్యాప్తి త్వరగా చెందుతుంది , తర్వాత కనీసం హాస్పిటల్ లో చేరాలంటే బెడ్డు కూడా దొరక్క పోవచ్చు. 
ఒకవేళ మనం హాస్పటల్ లో ఉంటే  *కన్న తల్లి/తండ్రి*..,*కొడుకు/ కూతురు*.*భార్య/భర్త* ఎవరిని కలవలేము... 
ఎందుకంటే  కలిస్తే వారు *ప్రమాదంలో పడతారు...*
పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది
కష్టం తో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది 
*"కాపాడండి డాక్టర్"* అని *అరిచిగీపెట్టినా* వినటానికి కూడా పక్కన ఎవరూ ఉండక పోవచ్చు. *ఉన్నా ఎవరూ ఏం చేయలేరు*...
మనం చనిపోతే * కనీసం * మృతదేహాన్ని కూడా ఇంటికి ఇంటికి పంపలేని పరిస్థితి ఎందుకంటే ఇతరులకు వ్యాప్తి వస్తుందేమో అన్న భయము.
ఇది అవసరమా....?! *
*మనకి అవసరమా...???** 
ఎందుకు *ఈ నిర్లక్ష్యం?*  ఎందుకు *ఈ ధీమా...!*
*ప్రాణం* అంటే ఎవరికి *తీపి ఉండదు...* 
అనవసరంగా *మన, మనవాళ్ల ప్రాణాలు తీసుకుందామా...??*
పొరపాటున *బయటికివస్తే...*
*మొహానికి ఖర్చీఫ్, బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత*...
ఇంతే కేవలం ఇంతే..
*80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది*...
*అత్యవసరం అయితేనే బయటకి రండి*...
*మనం బ్రతికి ఉంటేనే* గా *మన ఇంట్లోవాళ్లు సుఖం* గా ఉండగలరు... 
* గమనించండి :-*

 పోతే పోయింది *ఓ నెల*...
 మహా అయితే *కోలుకోవడానికి*... 
కష్టాన్ని, నష్టాన్ని *పూడ్చుకోవడానికి*...
*నెలో, ఏడాదో* పడుతుంది...
*భరిద్దాం*... 
*జీవితాన్ని కోల్పోవడం* కన్నా...
జీవితంలో *"నెల" కోల్పోవడం* బెటరే కదా...
*ఆలోచించండి* ...
అవసరమైతే తప్ప *బయటకి రాకండి* ...
పక్క రాష్ట్ర లు  (మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ )దేశాలు ( అమెరికా రష్యా స్పెయిన్ ఇటలీ) ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు ఎదురవకుండా చూసుకుందాం...... 
రాష్ట్ర  కోవిడ్ నోడల్ అధికారిగా ఇది నా పర్సనల్ విజ్ఞప్తి 
అందరం జాగ్రత్తగా ఉందాం!!
కుటుంబాన్ని కాపాడుకుందాం!!
సమాజానికి రక్షణ ఇద్దాం!!
*Let's Survive First* 
*Then Revive Next* 
*డాక్టర్  శ్రీకాంత్ ఆర్జా*

Related Posts