YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రామావతారం యొక్క ప్రయోజనం ఏమిటంటే .....

రామావతారం యొక్క ప్రయోజనం ఏమిటంటే .....

రామావతారం యొక్క ప్రయోజనం ఏమిటంటే 

ధానంగా రావణ సంహారం. భగవానుడు మనిషిగా పుడితే తప్ప రావణ సంహారం జరగదు. అందుకే ఆ యుగధర్మం ప్రకారం 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి సాధారణ శిశువుగా జన్మించాడు. కానీ, రాముడు కేవలం రావణ సంహారం కోసమే అవతతం స్వీకరించలేదు. రావణ సంహారం అయిన తర్వాత కూడా రాజ్యపాలన చేసాడు. 11,000 సంవత్సరాలు జీవించి మనుషులకు మార్గదర్శకం చేస్తాను అని తనకు తానుగా ప్రతిజ్ఞ స్వీకరించాడు. 
ఒక మనిషి ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చాడు. 
ఒక మనిషి ఎలా నవ్వుతాడో అలా నవ్వాడు.
ఒక మనిషి కష్టానికి ఎలా కృంగిపోతాడో అలా కృంగిపోయాడు.
ఒక మనిషి కష్టానికి ఎలా తట్టుకొని నిలబడగలడో అలా లేచి నిలబడ్డాడు. 
ఒక మనిషి ఎలా జీవించాలో అలా తాను జీవించి చూపించాడు.  
  సాధారణంగా పుట్టిన మనిషి తనువు చాలించాలి. ఇక్కడ రాముడు కూడా మనిషే కాబట్టి, తనువు చాలించాలి. ఇక్కడ "కాలం" రాముడ్ని చంపలేదు. "కాలం" ఒక తపస్వి రూపంలో "కాల పురుషుడు"గా వచ్చి రాముడి కర్తవ్యాన్ని గుర్తుచేశారు. దీని అర్ధం ఏమిటంటే సాధారణంగా మనుషులు చనిపోతే "కాలం చేశారు" అంటాము. వయసు అయిపోయిన తర్వాత, భూమి మీద తన జీవితం తీరిన తరువాత కాలం మనిషికి కొన్ని సంజ్ఞలు ఇస్తుంది. కంటి చూపు మందగించడం, ఆకాశంలో ఉల్కలు లాంటివి కనపడటం, మతిమరుపు రావడం మొదలైనవి.. ఇవి మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ రాముడు సాక్షాత్ విష్ణువు అవతారం కాబట్టి, స్వయంగా కాలమే వచ్చి కర్తవ్యాన్ని గుర్తుచేసింది. రామాయణంలో ఎక్కడా కూడా రాముడు తాను విష్ణువు అవతారం అని చెప్పుకోడు. ఎవరైనా అన్నాసరే, 'కాదు. నేను దశరధుని కుమారుడిని, రాముడ్ని' అంటాడు. రామాయణం చివర్లో రాముడు విష్ణువు అవతారం అని వాళ్ళ మధ్య సంభాషణ ద్వారా మనకి తెలుస్తుంది.   ఇక్కడ కాలపురుషుడు అంటే యమధర్మరాజు అనుకోవచ్చు. ఆయనే మానవాళిని లయం చేస్తాడు.  కానీ, వాల్మీకంలో ఇది చెప్పలేదు కాబట్టి, నేను కూడా 'కలపురుషుడిని' యముడు అనే సాహసం చేయను. కాబట్టి కాలం వలన రాముడు చనిపోలేదు. 'కాలం' రాముడికి, అవతార ప్రయోజనం అయిపోయిందని, తిరిగి వైకుంఠాన్ని చేరుకొని లోకాలను పాలించమని బ్రహ్మ దేవుని ద్వారా సందేశాన్ని తీసుకువస్తుంది. 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts