YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వేస్టేజ్ నుంచి  వర్మి కంపోస్ట్ 

వేస్టేజ్ నుంచి  వర్మి కంపోస్ట్ 

వేస్టేజ్ నుంచి  వర్మి కంపోస్ట్ 
హైద్రాబాద్, జూన్ 8
హైద్రాబాద్ నగరాన్ని స్వఛ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే నగరంలో ఆహార సంబంధిత తడి చెత్తను ఏక్కువగా ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తడిచెత్తతో సంస్థ ఆవరణలో ప్రత్యేకంగా కంపోస్టు పిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తార్నాకలోని ఓ హోటల్‌లో ఈ పిట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే నగరంలోని తాజ్‌మహాల్ గ్రూప్ హోటళ్లు కూడా ఇలాంటి పిట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చినట్లు ఆయన వివరించారు. బయో డయాస్టర్ అనే ఆధునిక విధానంతో తడి చెత్తతో ఎరువును తయారు చేయటంతో పిట్‌ను ఏర్పాటు చేసుకునే వ్యాపార సంస్థ వంట వంటి అవసరాలకు వినియోగించుకునేందుకు బయోగ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చునని మేయర్ వెల్లడించారు. అయితే మహానగరంలో ఎక్కడికక్కడ హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో వీటిని ఏర్పాటు చేస్తే తడి చెత్తను ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయిలో వినియోగించుకుని బయోగ్యాస్ తయారు చేసుకోవటంతో పాటు ఎరువు కూడా తయారవుతోంది. ఎరువును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉండటంతో ఈ దిశగా మరిన్ని వ్యాపార సంస్థలు ముందుకొచ్చి పిట్‌లను ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు. తడి చెత్తలోని నీటి శాతాన్ని బట్టి ప్రతి 50 కిలోల తడి చెత్తతో సుమారు ఐదు కిలోల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునని నిపుణులు వెల్లడించినట్లు మేయర్ తెలిపారు. ఈ రకంగా ఏర్పాటు చేసే ఒక్కో పిట్‌కు దాదాపు మూడున్నర లక్షల రూపాయల వరకు ఖర్చవుతోందని ఆయన వెల్లడించారు. అయితే ఈ రకంగా తడిచెత్తతో కంపోస్టు పిట్‌లను ఏర్పాటు చేసి బయోగ్యాస్, ఎరువులను తయారు చేయటం ఏకో ఫ్రెండ్లీ క్యాటగిరి కిందకు వస్తున్నందున, వీటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వర్తింపజేస్తే మరిన్ని హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ముందుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛ్భారత్ సాధనకు ప్రదాని మోది ఇచ్చిన పిలుపు మేరకు కొంతకాలంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసి చెత్తను ప్రతి ఇంటి నుంచి వేర్వేరుగా స్వీకరించేందుకు నగరంలోని 22 లక్షల కుటుంబాలకు 44లక్షల డస్ట్‌బిన్లను అందించారు అంతేగాక, తడి,పొడి చెత్తను వేర్వేరుగా తరలించేందుకు 2వేల ఆటో టిప్పర్లను సమకూర్చిన జిహెచ్‌ఎంసి ఇపుడు తడి,పొడి చెత్తను ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే అంశంపై కూడా దృష్టి సారించింది. మున్ముందు ప్రతి రోజు 10 నుంచి 20కిలోల తడి చెత్తను వినియోగించేందుకు వీలుగా ఇంట్లో కూడా ఇలాంటి కంపోస్టు పిట్‌లను ఏర్పాటు చేసే దిశగా ప్స్రోత్సహించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు

Related Posts