ప్రియుడి ఇంటి ముందు ధర్నా
వరంగల్ అర్బన్ జూన్ 8,
ప్రేమించి పేళ్లి చేసుకుంటానని నమ్మించి తీర వేరే అమ్మాయితో ఎంగెజ్ మెంట్ చేసుకున్న ప్రియుడు..మోసపోయానాని తెలుసుకున్న ప్రియురాలు అబ్బాయి ఇంటిముందు ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్ లో చోటు చేసుకుంది. సిద్దిపేటకు చెందిన దీప చదువుకోసం హన్మకొండ లో హస్టల్ ఉంటూ చదువుకుంది. వరంగల్ శివనగర్ కు చెందిన విరన్నతో ఆమెకు ఫ్రెండ్స్ ద్వారా పరిచయం పేరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. మూడురోజుల క్రితం ప్రియురాలుకు తెలియాకుండా వీరన్న వేరే అమ్మాయితో ఎంగెజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు మోసపోయానని శివనగర్ లో నివాసం ఉంటున్న ప్రియుడు ఇంటిముందు ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న స్థానిక మిల్స్ కాలనీ పోలిసులు సంఘటన స్థలానికి చేరుకోని వాళ్ళిద్దరిని పోలిస్ స్టేషనుకు తరలించారు.