కొనసాగుతున్న బార్డర్ చెక్ పోస్టులు
కోదాడ, జూన్ 08
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో బోర్డర్ చెక్ పోస్టులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేటి నుండి రాష్ట్రల మధ్య ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చిన నేపద్యంలో చెక్ పోస్ట్ ఎత్తివేస్తారని అంటారు భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బోర్డర్ లో వాహన తనిఖీలు యధావిధిగా కొనసాగుతున్నాయి.సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గల బోర్డర్ చెక్ పోస్ట్ లో వాహన తనిఖీలు యధామాములుగా జరుగుతున్నాయి. ఎపి నుండి వచ్చే వాహనాలను తనిఖీ చేసి వైద్య పరీక్షల అనంతరం 28 రోజుల హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాల ప్రకారం నెట్ నుండి రాష్ట్రంగా మధ్య ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చెక్ పోస్ట్ లను ఎత్తివేస్తారని అందరూ భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దింతో బోర్డర్ చెక్ పోస్టులో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి.