కాగ్ రిపోర్ట్ ఆధారంగా నైతికత పాటించాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షంలేకుండానే బడ్జెట్ ముగించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారు. .మిగితావారిని సస్పెండ్ చేశారు. ఇలాంటి తప్పులు మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా జరగలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. బాధ్యతా రహిత లెక్కలు చూపారు...ఇదంతా తెలిసే జరిగింది. అప్పులను రెవెన్యూ గా చూపించారు. ఉదయ్ స్కీమ్ కింద డిస్కం కు 9వేల కోట్లు ఇవ్వాల్సింది. 7వేల 500కోట్లు ఇచ్చారు. 3వేల 750 కోట్లు ఈక్విటీగా...చూపారు...వాస్తవానికి వీటిని గ్రాంట్స్ గా చూపించాలి. వెయ్యి కోట్లు హడ్కో నుంచి తీసుకుని...రెవెన్యూగా చూపించారని ఆమె వ్యాఖ్యానించారు. తెలిసి తప్పులను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వాన్ని మోసపూరితంగా నడుపుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం...చేతగాని తనంగానే భావించాలి. ఇటువంటి నేరాలు ప్రైవేట్ లో చేస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోలు అప్పులు కూడా తీర్చిలేని పరిస్థితి. తలసరి 63వేలు కోట్లు అప్పులయ్యాయి..వీటిని 7ఏళ్ళు లోపు చెల్లించాలి. కాగ్ లోని కొందరు అధికారులు ఇల్లీగల్ అనికూడా అంటున్నారని ఆమె అన్నారు. సర్ ప్లస్ బడ్జెట్ అని చెప్పి ఖర్చుమాత్రం సరిగ్గా పెట్టడంలేదన అన్నారు.
సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి నెట్టబడింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎస్సి, ఎస్టీ, బీసీ వెల్పేర్, మైనార్టీల వెల్పేర్ కు 50శాతం కూడా ఖర్చు పెట్టలేదు. 1లక్షా 20వేల బడ్జెట్ లో.... సంక్షేమానికి సంబంధించి 80వేల కోట్లు కేటాయించితే... దాంట్లో...40వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని అయన విమర్శించారు. అప్పులు చేయడానికి తప్పుడు లెక్కలు చూపెట్టారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మిమ్మల్ని క్షమించవని అన్నారు. మీకు ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కులేదు. అప్పులు తెచ్చి ఎక్కడ కమిషన్ దొరుకుతుందో...అక్కడ ఖర్చు పెడుతున్నారు. మిషన్ భగీరథ తో గ్రామీణ రోడ్స్ చిన్నాబిన్నం అవుతున్నాయని అన్నారు. హరీష్ రావు ఎవరినో ఒకరిని ప్రాజెక్టులవద్దకు తీసుకెళ్లి మార్కెటింగ్ చేసుకుంటున్నారని అయన ఆరోపించారు.