YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 సెల్ఫ్ క్వారంటైన్ లో అరవింద్

 సెల్ఫ్ క్వారంటైన్ లో అరవింద్

 సెల్ఫ్ క్వారంటైన్ లో అరవింద్
న్యూఢిల్లీ, జూన్ 8,
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని ప్రచారం సాగుతోంది. జలుబు, గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతున్న కేజ్రీవాల్.. అర్ధాంతరంగా తన కార్యక్రమాలను రద్దుచేసుకున్నాని సమాచారం. అయితే, దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సమావేశాలను మాత్రం ఆయన రద్దుచేసుకున్నట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మంగళవారం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలున్న వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హితవుపలికారు. ఢిల్లీలో కొన్ని ఆస్పత్రులు కోవిడ్-19 బాధితులకు అనుమతిని నిరాకరిస్తున్నాయన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బ్లాక్-మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తే మీరు తప్పించుకోలేరని కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.కాగా కొద్దీ రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కార మార్గం అన్వేషిస్తున్నామని, పడకలు అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ రోగులను నిరాకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లక్షణాలు లేనప్పటికీ పరీక్షల నిర్వహించడం వల్ల ఆసుపత్రుల వద్ద సామాజిక దూరం పాటించలేరని, తద్వారా ఢిల్లీలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందన్నారు. లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్ష చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts