YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్యాంగ్ వార్ లో కొత్త ట్విస్ట్

గ్యాంగ్ వార్ లో కొత్త ట్విస్ట్

గ్యాంగ్ వార్ లో కొత్త ట్విస్ట్
విజయవాడ, జూన్ 8, 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌ వార్‌పై పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ వార్‌కు సంబంధించి విజయవాడ సిటీ కమిషనర్ ద్వారకా తిరమలరావు కీలక సమాచారం అందించగా.. తాజాగా, సోమవారం డీసీపీ హర్షవర్ధన్‌ మీడియా ముందుకొచ్చారు. గ్యాంగ్ వార్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కూడా డీసీపీ మీడియా ముందు ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.సెటిల్‌మెంట్ విషయంలోనే మరణించిన సందీప్, పండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. గ్యాంగ్‌‌వార్‌ ఘటనలో ఇప్పటి వరకూ మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సందీప్ హత్యకు కారణమైన 13 మందిని.. అలాగే పండుపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఓ అపార్ట్‌మెంట్ విషయంలో సెటిల్‌మెంట్ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు.అయితే పండు, సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో నుంచి లేవలేదని డీసీపీ హర్షవర్ధన్‌ తెలిపారు. దీంతో ‘‘పిల్లోడివి మా ముందే కుర్చుంటావా’’ అంటూ సందీప్ వర్గానికి చెందిన కిరణ్‌ కుమార్ కర్రతో పండును రెండుసార్లు కొట్టడంతో ఒక్కసారిగా గొడవ చెలరేగిందని వివరించారు. ఈ గొడవ అక్కడ చెలరేగడానికి తక్షణ కారణం కిరణేనని, అతడు రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు దారి తీసిందని డీసీపీ స్పష్టం చేశారు. సెటిల్‌మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్.. పండు ఇంటికెళ్లి బెదిరించాడన్నారు. ఆ తర్వాత పండు కూడా సందీప్ షాప్ వద్దకు వెళ్లి హల్‌చల్ చేశాడన్నారు. రెండు గ్యాంగు‌ల్లో ఉన్నవారంతా క్రిమినల్సేనన్నారు. అందరికీ క్రిమినల్ హిస్టరీ ఉందని పేర్కొన్నారు. సందీప్ తన స్కూల్ ఫ్రెండ్స్‌నే దందాలకు ఉపయోగించుకున్నాడని వివరించారు. కేవలం బెదిరించాలని వెళ్తే.. చంపుకునేంత వరకూ వెళ్లిందన్నారు.అలాగే సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆయన భార్య తేజస్విని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీసీపీ కొట్టిపారేశారు. సందీప్ హత్య వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరని తేల్చి చెప్పారు. కేవలం కిరణ్ అనే వాడు రెచ్చగొట్టడం వల్లే గొడవకు కారణమని చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మంగళగిరి నుంచి వచ్చారన్నారు. అలాగే పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉందన్నారు. ఓ కేసులో ఆమె పేరు ఉందని తెలిపారు. ఆమె పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆమె పాత్ర ఉందని తేలితే అరెస్ట్ చేస్తామని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు.
 

Related Posts