బీటెక్ పరీక్షల షెడ్యూల్
విజయవాడ, జూన్ 8,
కరోనా నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020-21)లో క్లాసుల ప్రారంభం, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పాఠ్యాంశాల పూర్తి, పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా అకడమిక్ కేలండర్‌ను రూపొందించినట్లు సమాచారం.ఈ క్యాలండర్ ప్రకారం..కరోనా కారణంగా వాయిదా పడిన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ పరీక్షలు జులై 1 నుంచి 15 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. త్వరలో ఈ విషయంపై పూర్తి స్పష్టతతో పాటు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.వాయిదా పడిన పాఠ్యాంశాలను జూన్ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 15లోపు పూర్తి చేయాలి.
ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఇతర థియరీ పరీక్షలను జులై చివరి నాటికి ముగించాలి.
ఇక డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు జనవరిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి.