నాలుగో విప్లవంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవతరించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ వేదికగా జరుగుతున్న ఆనంద నగరాల సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు. సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు. ‘గేట్వే టు ద ఈస్ట్’ థీమ్తో మూడు రోజుల సాటు కొనసాగనున్న ఈ సంతోష నగరాల సదస్సు కు ఫిన్లాండ్, యూకే, సింగపూర్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్, స్పెయిన్, అమెరికా తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు. వారితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఆర్కిటెక్ట్లు, నగర ప్రణాళిక నిపుణులు హజరయ్యారు. వర్ధమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి దిశగా సాగుతున్న నగరాలలో ఎదురవుతున్న సవాళ్లు- వాటికి పరిష్కారాలు కనుక్కోవడం, ఆ దిశగా ఆవిష్కరణలను కనుగొనడం తదితర అంశాపై సంతోష నగరాల సదస్సులో చర్చిస్తారు. అంతర్జాతీయంగా తొలిసారి ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆదాయం, సంపద అన్నిసార్లు సంతోషాన్ని ఇవ్వవని పేర్కొన్నారు. పారదర్శక పాలనా వ్యవస్థ, నివాస యోగ్యమైన ఆవాసాలు కల్పించేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రజల ఆనందకరమైన జీవనం కోసం ప్రణాళికలు చేస్తున్న నగరాలున్నాయని పేర్కొన్నారు. ఫిన్లాండ్, సింగపూర్ లాంటి అవాసయోగ్యమైన దేశాలు అందరికీ ఆదర్శమన్నారు. అందరూ అక్కడే స్థిరపడాలని అనుకుంటారు, అందుకే ఆ స్థాయిలో అమరావతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. జీవన ప్రమాణాలు పెంచేందుకు విధానాలను అన్వేషిస్తున్నామన్నారు.