YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మూడో పంటకు సిద్ధమౌతున్న రైతాంగం

మూడో పంటకు సిద్ధమౌతున్న రైతాంగం

మూడో పంటకు సిద్ధమౌతున్న రైతాంగం
ఏలూరు, జూన్ 9
వ్యవసాయరంగం పరుగులు పెడుతోంది. సాగులో ఖర్చులు తగ్గించి, నాణ్యత పెంచేందుకు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసింది. జిల్లాలో మూడోపంట వేసేదిశగా ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టారు. వర్షాలు అంత ఆశాజనకంగా లేకపోయినా రైతుల కృషి కూడా ప్రభుత్వానికి తోడవుతుండటంతో మూడోపంటకు ఆస్కారం ఏర్పడుతోంది. ఉన్నకొద్దిపాటి నీటితోనే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తద్వారా దిగుబడి పెరిగి ఉత్పాదకత పెరిగింది. చేపల చెరువులు ఏర్పడటంతో విస్తీర్ణం తగ్గినా ఉత్పాదకత పెరిగి రైతుల ఆశలకు ఊపిరిపోసింది. గత రెండేళ్లలో ఎకరాకు 40 నుంచి 55బస్తాల వరకు దిగుబడి వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో రెండంకెల వృద్ధి నమోదు చేసుకుంటోంది. మూడేళ్లుగా మూడోపంటకు ఆస్కారం ఏర్పడుతోంది.ప్రభుత్వం భావించడంతో సాంకేతిక వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సంప్రదాయ వ్యవసాయం స్థానే యాంత్రిక, అత్యాధునిక పద్ధతుల దిశగా అడుగులు వేయించింది. గత రబీలో 13.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అదే ఖరీఫ్‌లో 13.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లక్ష్యంగా ప్రణాళిక నిర్దేశించుకున్నారు. రబీలో పంట కోత ప్రయోగంలో 46బస్తాల వరకు దిగుబడి వచ్చింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం చూస్తే.. ఎకరాకు రికార్డుస్థాయిలో 60 నుంచి 70 బస్తాల దిగుబడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది విస్తీర్ణం తగ్గి వృద్ధిరేటు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఉత్పాదకత మాత్రం పెరిగింది. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏడాది 15వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 25వేల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణాల విషయంలో కూడా అధికారులు ప్రణాళికా యుతంగా ముందడుగు వేస్తున్నారు. రూ. 2వేల కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బ్యాంకర్ల ద్వారానే రుణాలు ఇస్తుండగా, ఖరీఫ్‌ నుంచి సొసైటీల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన బ్యాంకర్స్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 2.26లక్షల హెక్టార్ల వరకు వరిసాగు చేస్తున్నారు. రబీలోనూ ఇంచుమించుగా అంతే విస్ణీర్ణం ఉన్నా.. పంటలే మారుతుంటాయి. మిగిలిన పంటలతో కలిపి మొత్తంగా 2.46 లక్షల హెక్టార్ల నుంచి 2.50 లక్షల హెక్టార్ల వరకు సాగవుతుంది.చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద రూ.4,909 కోట్లతో మూడు ఎత్తిపోతలు నిర్మించనున్నారు. దీనిలో ఇంతవరకు రెండు ఎత్తిపోతలు పూర్తి చేశారు. మూడోది పట్టిసీమ వద్ద నిర్మించనున్నారు. అవి నిర్మాణం పూర్తయ్యితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు. 191 గ్రామాలకు తాగునీరు అందనుంది. 15.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. 68 కిమీల మేర ప్రధాన కాలువ తవ్వుతారు. 

Related Posts