YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మరింత పటిష్టంగా ఉపాధి హామీ : మంత్రి లోకేష్

మరింత పటిష్టంగా ఉపాధి హామీ : మంత్రి లోకేష్

ఉపాధిహామీ పథకం అమలు లో దేశానికే ఆదర్శంగా నిలిచాం. చిన్న రాష్ట్రం అయినా అనేక అంశాల్లో మనం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం . మంచి ఫలితాలను సాధించినందుకు అందరినీ అభినందిస్తున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం సచివాలయం లో మంత్రి ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్లతో వర్క్ షాప్ నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధిహామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ మరింతగా కష్ట పడి ఈ సంవత్సరం అనుకున్న లక్ష్యాల కంటే ఎక్కువుగా ఉపాధి హామీ పథకం కింద 10 వేల కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. గత పాలకుల హయాంలో మెటీరియల్ కంపోనెంట్ రూపంలో వచ్చిన 3200 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు పక్కా ప్రణాళికతో అన్ని గ్రామాల్లో మౌలికవసతులు కల్పిస్తున్నామని అన్నారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 21.53 కోట్ల పనిదినాలు పూర్తి చేసి స్వల్ప తేడాతో నాలుగో స్థానంలో నిలిచాం. ఈ సంవత్సరం మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా పనిచెయ్యాలని అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభించిన 6 వేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. అన్ని గ్రామాల్లో అభివృద్ధి సమానంగా జరగాలి.ఈ సంవత్సరం ఉపాధిహామీ పథకంలో భాగంగా 20 లక్షల కంటే తక్కువ ఖర్చు చేసిన గ్రామాలు ఉండకూడదని అన్నారు. వేసవిలో ఉపాధిహామీ వేతనదారులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చెయ్యాలి.ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న 791 ఫీల్డ్ అస్సిటెంట్ల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని మంత్రి అన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి,పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా,ఉపాధిహామీ పథకం అడిషనల్ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం,పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు,పిడీలు పాల్గొన్నారు.

Related Posts