YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త టెక్నాలజీతో మేడారం జాతరలో బందోబస్తు

కొత్త టెక్నాలజీతో మేడారం జాతరలో బందోబస్తు

కొత్త టెక్నాలజీతో మేడారం జాతరలో బందోబస్తు

ఆదివాసీ మహాజాతర హైటెక్ హంగులు అద్దుకుంటున్నది. కోటిమందికిపైగా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పోటెత్తనుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. క్రౌడ్ కౌంటింగ్, క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలతోపాటు, తప్పిపోయినవారి వివరాలను ఫొటోలతో తెలిపేందుకు వీఎంఎస్ బోర్డులను పోలీసులు జాతరలో ఏర్పాటుచేస్తున్నారు. గగనతల వీక్షణకు డ్రోన్ కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు యాప్‌లు, వెబ్‌సైట్లు సిద్ధం చేశారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం... క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు ఎక్కడైనా భక్తులు పెద్దసంఖ్యలో గుమిగూడినా, నిలిచిపోయినా క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు గుర్తించి కంట్రోల్‌రూమ్ ద్వారా సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది.

దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని పంపించివేస్తారు. కోటిమందికిపైగా జనసమూహం 10నుంచి 15కిలోమీటర్ల అతి చిన్న ప్రదేశంలోకి వస్తుండటంతో.. అక్కడ ఏ ఒక్క నిమిషం అంతరాయం ఏర్పడినా సరిచేయడానికి పోలీసులకు తలకుమించిన సమస్య అవుతుంది. అందుకే క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు అటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు హెచ్చరికలు చేస్తుంది.

ఎక్కడైనా వెయ్యిమంది నిలిచినట్లు కెమెరా గుర్తించగానే ఆ ప్రదేశం వివరాల్ని కంట్రోల్‌రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో అక్కడి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు అక్కడికి చేరుకుని వారిని అక్కడినుంచి ముందుకునడిపిస్తారు. వెనుకాల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు.

డ్రోన్ కెమెరాలు సమ్మక్క సారలమ్మ జాతర జరిగే నాలుగు రోజుల్లో మేడారానికి కోటిమందికిపైగా భక్తులు రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. మేడారం అటవీప్రాంతంలో ఉండటంతో భక్తుల తాకిడికి తొక్కిసలాట జరుగకుండా, వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా 4 డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. జాతరకు ముందునుంచే భక్తులు రోజూ పెద్దసంఖ్యలో వస్తుండటంతో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. వీఎంఎస్ మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్రధానంగా భయాందోళనలకు గురయ్యేది పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని..

కోటిమంది భక్తులు వస్తుండటంతో తమవారు ఎక్కడ తప్పిపోతారోనని తల్లిదండ్రులు భయపడుతుంటారు. కానీ, ఈసారి ఆ ఆందోళనలు తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. వీఎంఎస్ బోర్డులు జాతరలో 10 వరకు ఏర్పాటుచేయనున్నారు. ఇందులో తప్పిపోయిన వారి ఫొటోలను ప్రదర్శిస్తూ..

వారి సంబంధీకుల వివరాలు ప్రదర్శించడంతోపాటు మైక్‌లో అనౌన్స్ చేయనున్నారు. దీంతో భక్తులకు అవసరమైన సూచనలు, ట్రాఫిక్ అంశాలు వెల్లడించనున్నారు. క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు జాతరలో అమ్మవారి గద్దెల ప్రాంగణంలో తొక్కిసలాటకు తావులేకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆరు క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి గద్దెల వద్దకు భక్తులు వెళ్లేసమయంలో వాళ్లను లెక్కించి..

కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. నిర్దేశిత సమయంలోగా వాళ్లు బయటకు వెళ్లారా లేదా..? అన్నది ఎగ్జిట్‌లో ఉన్న కెమెరాలు పరిశీలిస్తాయి. ఉదాహరణకు గద్దెల ప్రాంగణంలో సుమారు రెండువేల మంది భక్తులు ఉండేందుకు అవకాశం ఉంటే..

వారికి తల్లుల దర్శనానికి 20 నిమిషాలు పడుతుందని అనుకుంటే, ఆ సమయంలోగా వాళ్లు బయటకురాకపోతే కంట్రోల్‌రూమ్‌లోని పోలీసు సిబ్బందిని ఎగ్జిట్ గేట్‌లోనున్న కెమెరాలు అలర్ట్ చేస్తాయి. దీంతో అక్కడినుంచి గద్దెల వద్దనున్న సిబ్బందికి సమాచారం అందుతుంది. వాళ్లు త్వరగా భక్తులను బయటకు పంపేందుకు అప్రమత్తం అవుతారు. హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు గతంలోనే హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే, ఈసారి యాప్ రూపంలో బుకింగ్‌కు రెవెన్యూ శాఖ అవకాశం కల్పించింది. హైదరాబాద్‌నుంచి ఒక్కొక్కరికీ రూ.12,999 చార్జీ వసూలు చేస్తుండగా, మేడారంనుంచి జాతర పరిసరాల్ని వీక్షించేందుకు ఒక్కొక్కరికీ రూ.2,499 వసూలు చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మేడారం యాప్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితోపాటు జాతరకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ను యాప్‌లో ఏర్పాటుచేశారు.

జాతరలో జంపన్నవాగు ఎక్కడ ఉంది..? అక్కడినుంచి గద్దెల ప్రాంగణానికి ఎలా వెళ్లాలి..? తిరిగి బస్టాండ్ కాంప్లెక్స్‌కు ఎలా చేరుకోవాలో తెలిపే మ్యాప్‌ను ఏర్పాటుచేశారు. 200 సీసీటీవీ కెమెరాలు సమ్మక్కసారలమ్మ మహాజాతరకు పోలీసు శాఖ గద్దెలకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

ట్రాఫిక్ నియంత్రణ, జాతరలో రద్దీని గుర్తించటం, దొంగతనాల నివారణ, బందోబస్తును పర్యవేక్షించేందుకు మేడారం పరిసరాల్లో అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్నవాగు, చిలుకలగుట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, రెడ్డిగూడెం, ఇంగ్లిష్‌మీడియం, వనం రోడ్డు, గద్దెల ప్రాంగణం, మేడారం వై జంక్షన్, పోలీసు

Related Posts