YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో కరెంట్ మోత

తెలంగాణలో కరెంట్ మోత

తెలంగాణలో కరెంట్ మోత
హైద్రాబాద్, జూన్ 9,
లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు నెలవారీ రాలేదు. పాత బిల్లులు చెల్లించాలని కోరడంతో అదే పని చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఆ తరువాత బిల్లులు తీశారు. రెండు నెలల యూనిట్స్ లెక్కించి స్లాబ్ రేట్ మారడంతో అందరికి విద్యుత్ బిల్లులు షాక్ కొట్టించేశాయి. దీనిపై వినియోగదారులు గగ్గోలు పెట్టారు. విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అధిక బిల్లులతో వాతలు పెడతారా అంటూ కొద్ది రోజులు ఆందోళన సైతం చేశారు. అయితే అధికారపార్టీ అధిక బిల్లులకు అంతా ఇంట్లో ఉంటూ వాడకం ఎక్కువ చేయడం వల్లే అంటూ విద్యుత్ శాఖ సమర్ధించుకుంది.ఏపీ లో ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉండగా తెలంగాణ లో మాత్రం ఈ అంశంపై ఎలాంటి వివాదాలు రాలేదు. ఇది కెసిఆర్ సర్కార్ సమర్ధతకు నిదర్శనం అని అంతా కొనియాడారు. కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ లో మరింతగా వినియోగదారులకు విద్యుత్ బిల్లులు వాతలు పెట్టేశాయి. ఇదెలా జరిగింది అని చూస్తే ఏపీ కన్నా దారుణంగానే అక్కడి వినియోగదారులను అక్కడి విద్యుత్ సంస్థలు బురిడీ కొట్టించేశాయి. గత ఏడాది మార్చి నెలలో ఎంత చెల్లించారో అంత చెల్లిస్తే సరిపోతుందని తొలుత కెసిఆర్ సర్కార్ వినియోగదారులకు సెలవిచ్చింది.ఏప్రిల్ కూడా అలాగే చెల్లించారు. ఇప్పుడు గత మూడు నెలలకు యూనిట్లు లెక్కేసి బిల్లులు తీస్తుండటం అందులో స్లాబ్ లు మారిపోవడంతో అంతా గందరగోళం ఏర్పడింది. భారీ మొత్తంలో బిల్లులు కట్టాలిసిన పరిస్థితిలో అంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు. దీనిపై అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే ఏపీ లాగానే అక్కడ కూడా ఈ వివాదం కొద్ది రోజులు సాగి ముగిసేలాగే ఉంది. వినియోగదారులు మాత్రం ఇటు ఎపి అటు తెలంగాణ లో లాక్ డౌన్ దెబ్బలు విద్యుత్ బిల్లుల రూపంలో తినక తప్పడం లేదు.

Related Posts