YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా బంద్ 

విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా బంద్ 

విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా బంద్ 
విశాఖపట్నం జూన్ 9, 
జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ  ఉభయ తెలుగు రాష్ట్రాల మన్యం బందును జీవో నెంబర్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3 సాధన సమితి నాయకులు అప్పల నరస మాట్లాడుతూ గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 రద్దు వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని గతంలో జీవో నెంబర్ 3 వల్ల సుమారు 25 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిగిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టివేసి 41 రోజుల్లో దాటుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం తీవ్రంగా ఖండించారు. జీవో నెంబర్ 3 లు పునరుద్ధరించే వరకూ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ 3 పై తీర్మానం చేసి ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఈ బందును అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఉపాధ్యాయ ఉద్యోగ గిరిజన సంఘాలు. జీవో 3 రాష్ట్ర సాధన కమిటీ అధ్యక్షులు తావుడన్న పాల్గొన్నారు. 

Related Posts