YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గోదావరి జలాలను కాపాడుకుందాం 

గోదావరి జలాలను కాపాడుకుందాం 

గోదావరి జలాలను కాపాడుకుందాం 
- కంబాలచెరువు పంపింగ్ హౌస్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి 
రాజమహేంద్రవరం జూన్ 9
గోదావరి జలాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు పార్కులో నిర్మాణంలో ఉన్న పంపింగ్ హౌస్ ను  ఆమె తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు ), తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మనమంతా పవిత్రంగా భావించే గోదావరిలో వ్యర్ధాలు, మురుగునీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దాని కోసం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ పంపింగ్ హౌస్ వల్ల నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిలోని వ్యర్థాలను తొలగించి ... ఆ నీటిని శుద్ధి చేసి ఎస్టిపి ప్లాంట్ కు మళ్లించి అక్కడ శుద్ధి జరిగిన తరువాత గోదావరిలోకి వదలడం జరుగుతుందన్నారు . ఈ విధానం వల్ల గోదావరి నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు . ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సుందర నగరంగా పేరున్న రాజమహేంద్రవరం వర్షాల సమయంలో ఎక్కువ శాతం ముంపునకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పది రోజుల్లో పంపింగ్ హౌస్ నిర్మాణం పనులు పూర్తయి ప్రారంభం కాబోతోందన్నారు . పంపింగ్ హౌస్ ప్రారంభమైతే నల్లా ఛానెల్ కు, ఎన్ఆర్ సీపీ ప్లాంట్ కు ఒత్తిడి తగ్గుతుందన్నారు. అంతే కాకుండా నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉంటాయని వివరించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజమహేంద్రవరం ముంపునకు గురి కాకుండా చూడడంతో పాటు ... నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. 
 

Related Posts