కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం
విజయనగరం జూన్ 9,
తనకు ప్రభుత్వం నుండి ఇళ్ల స్ధలం మంజూరు కాక పోవడంతో , విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు .అక్కడ ఉన్న పోలీసు, కలెక్టరేట్ సిబ్బంది అతడిని వారించి ,ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని నిలువరించారు. బొబ్బిలి మండలం పారాది గ్రామమని ,తన పేరు ఇస్మాయిల్ అని, ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్ధలం కోసం తొలి రెండు లిస్ట్ ల లోని పేరు వచ్చిందని, మూడవ లిస్ట్ లో పేరు తీసేసారని చెప్పాడు. ఈవిషయమై సచివాలయానికి వెళ్లి అడగగా వైసీపీ నాయకులే చూస్తున్నారని, మాకు తెలియదని సచివాలయ సిబ్బంది చెప్పారు. దీంతో చేసేది లేక తాను బొబ్బిలి ఎమ్మార్వో ని సంప్రదించగా వైసీపీ నాయకులు ఏమి చెప్తే అది చేస్తామని, నువ్వు ఎవడవి నన్ను అడగడానికంటూ.. బొబ్బిలి ఎమ్మార్వో దుర్భాషలాడారని బాధితుడు అరోపించాడు. తనకు రేషన్ కూడా వాలంటీర్ ఇవ్వడం లేదన్నారు. వైసీపీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇస్తారంటున్నారని, ఇదెక్కడి అన్యాయమని ఇస్మాయిల్ అధికారులను ప్రశ్నించాడు. ఇక చేసేది కలెక్టరేట్ కి వచ్చి ఆత్మహత్య కు పాల్పడ్డానని చెప్పాడు. ఇకనైనా సంబంధిత అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపి లబ్ది చేకురుస్తారని అధికారులను వేడుకుంటున్నాడు.